Leading News Portal in Telugu

Colorfit Chrome Smart Watch : అదిరిపోయే లుక్ లో సూపర్ ఫీచర్స్ తో నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్.. ధర?


Colorfit Chrome Smart Watch : అదిరిపోయే లుక్ లో సూపర్ ఫీచర్స్ తో నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్.. ధర?

స్మార్ట్ వాచ్ లకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగి పోయింది.. ఇక స్మార్ట్ వాచ్ కంపెనీలు కూడా అదిరిపోయేలా ఫీచర్స్ ను అందిస్తున్నాయి.. అందులో నాయిస్ ముందుంది.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. నాయిస్‌ కలర్‌ ఫిట్‌ క్రోమ్‌ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు.. ఆ వాచ్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


జనవరి 19వ తేదీ నుంచి సేల్ ప్రారంభం అయ్యింది.. నాయిస్‌ కలర్‌ఫిట్‌ క్రోమ్‌ పేరుతో ఈ కొత్త వాచ్‌ను లాంచ్‌ చేశారు. ఈ వాచ్‌ను మెటల్‌ బాడీతో స్టన్నింగ్‌ లుక్‌తో డిజైన్ చేశారు. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 1.85 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో నేరుగా వాచ్‌తోనే కాల్స్‌ ను కూడా మాట్లాడుకోవచ్చు.. అంతేకాదు ఈ వాచ్‌ 100 కంటే ఎక్కువ వాచ్‌ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. హార్ట్‌ బీట్‌ రేట్‌, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి, స్ట్రెస్‌, స్లీప్‌ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌లో 100 కంటే ఎక్కువ ఇన్‌బిల్ట్ స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు.. అలాగే నోటిఫికేషన్స్‌తో పాటు, వెదర్‌ అప్‌డేట్స్‌, రిమైండర్స్‌, అలారం, కెమెరా యాక్సెస్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజుల పాటు పని చేస్తుంది..

ఇకపోతే ఈ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 5000గా నిర్ణయించారు. రూ. 499 చెల్లించి అడ్వాన్స్‌ బుక్‌ చేసుకున్న వారికి డిస్కౌంట్స్‌ కూడా లభిస్తున్నాయి…