Leading News Portal in Telugu

Vivo V30 Pro Launch : వివో నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్స్, ధర?


Vivo V30 Pro Launch : వివో నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్స్, ధర?

ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వి30 ప్రో పేరుతో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. వివో ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ధృవీకరించింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్‌లోని 3 కెమెరాలు జీస్ లెన్స్‌లతో అమర్చబడి ఉంటాయి. ఈ ఫోన్ ను ఈ నెల 28 న లాంచ్ చెయ్యనున్నారు.. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెర్ల్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఫోన్ లాంచ్ అవుతుందని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.. ఈ ఫోన్ కెమెరా కూడా బాగానే ఉందని తెలుస్తుంది..

కెమెరా విషయానికొస్తే.. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇటీవల టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. వివో వి30 ప్రో 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటుంది. 50ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా రావచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 80డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.. డిసెంబర్ 2023లో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్18 ప్రో మాదిరిగా ఫీచర్లు ఉన్నాయని సూచిస్తున్నాయి.. ఫ్రీ బుకింగ్స్ కూడా మొదలైనట్లు తెలుస్తుంది..