Leading News Portal in Telugu

OnePlus 12R Full Refund: ‘వన్‌ప్లస్‌ 12ఆర్‌’ స్మార్ట్‌ఫోన్‌ కొన్నారా?.. మీకు పూర్తి రిఫండ్‌ వస్తుంది!



Oneplus 12r Smartphone

OnePlus 12R Smartphone Buyers Can Seek Full Refund: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’ కీలక నిర్ణయం తీసుకొంది. కొత్తగా లాంచ్‌ అయిన ‘వన్‌ప్లస్‌ 12ఆర్‌’ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్‌ 12ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ స్టోరేజీ (యూఎఫ్‌ఎస్‌)పై తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 వరకు ఈ సదుపాయం ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్ మరియు సీఓఓ కిండర్ లియు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

వన్‌ప్లస్‌ కంపెనీ ఇటీవల వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ 12ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. వన్‌ప్లస్‌ 12ఆర్‌ను రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హై ఎండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ గల 16 జీబీ+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.45,999గా వన్‌ప్లస్‌ నిర్ణయించింది. స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 2 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వచ్చిన వన్‌ప్లస్‌ 12ఆర్‌లో యూఎఫ్‌ఎస్‌ (యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్) 4.0 స్టోరేజీ ఉంటుందని లాంచింగ్ సమయంలో కంపెనీ ప్రకటించింది. అయితే తాజాగా యూఎఫ్‌ఎస్‌పై వన్‌ప్లస్‌ ఓ షాకింగ్‌ న్యూస్ వెల్లడించింది.

Also Read: OG Movie: పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’పై క్రేజీ అప్‌డేట్‌.. 10 ఏళ్ల విరామం!

వన్‌ప్లస్‌ 12ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌ హై స్టోరేజీ వేరియంట్‌ యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజ్‌తో వచ్చాయని కంపెనీ పేర్కొంది. లాంచింగ్ సమయంలో తప్పుగా (4.0 స్టోరేజీ) ప్రకటించామని తెలిపింది. వన్‌ప్లస్‌ 12ఆర్‌ 256జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేసినవారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్‌ చేస్తామని సీఓఓ కిండర్ లియు తెలిపారు. మార్చి 16 లోగా రిఫండ్‌ ఇస్తామని చెప్పారు. వన్‌ప్లస్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.