Leading News Portal in Telugu

Samsung Galaxy A34 5G Price: శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు!



Pawan Kalyan

Samsung Galaxy A34 5G Offers and Discounts: సౌత్ కొరియాకు చెందిన ‘శాంసంగ్‌’ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫోన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గెలాక్సీ సిరీస్‌తో మంచి ఆదరణ పొందిన శాంసంగ్‌.. తమ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును కూడా అందిస్తుంటుంది. తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ.26,499కి అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ గతేడాది లాంచ్‌ అయింది.

శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్ వెబ్‌సైట్‌లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు ఉంది. 8GB+256GB వేరియంట్ అసలు ధర రూ.39,499 కాగా.. 32 శాతం తగ్గింపు తర్వాత రూ.26,499కి మీకు లబిస్తుంది. అంతేకాదు అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో గెలాక్సీ ఏ34 5జీని మరింత తక్కువకు కొనుగోలు చేయొచ్చు.

Also Read: Mohammed Shami: ఆ ఇద్దరు తెలుగు హీరోలు చాలా ఇష్టం: షమీ

శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 5జీ 6GB+128GB మోడల్ వేరియంట్‌ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌పై రూ.3,000 తగ్గింపు లభించింది. ఇక 8GB +128GB వేరియంట్ అసలు ధర రూ.35,499లకు బదులుగా.. రూ.24,499లకే లభిస్తోంది. 30 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి గెలాక్సీ ఏ34 5జీని కొనాలనుకునే వారు వెంటనే బుక్ చేసుకోండి. ఇందులో 6.6-అంగుళాల సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 SoC, ఓఐస్‌తో 48MP ప్రైమరీ సెన్సార్, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.