Leading News Portal in Telugu

Xiaomi 14 Ultra Launch : సెల్ఫీ ప్రియులకు గుడ్ న్యూస్..షావోమీ నుంచి మరో స్మార్ట్ ఫోన్..



Xiomi

ప్రముఖ ఎలెక్ట్రానిక్ దిగ్గజం షావోమీ కంపెనీ నుంచి వచ్చిన అన్ని ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ రాబోతుంది.. షావోమీ 14 అల్ట్రా మోడల్.. ఈ ఫోన్ ను ఈ ఏడాదిలోనే చైనాలో లాంచ్ చేశారు.. షావోమీ 14 అల్ట్రా ఫోన్ గత వెర్షన్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, కంపెనీ అన్ని వైపులా కర్వడ్ డిస్‌ప్లేను విస్తరించినట్లు కనిపిస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతుంది. లైకా సమ్మిలెక్స్ ట్యూన్డ్ లెన్స్‌లతో వస్తుంది.. ఫీచర్స్, కాస్ట్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కు సంబందించిన ఫీచర్స్ ను చూస్తే.. అల్ట్రా మోడల్ 3,000నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.73-అంగుళాల 120హెచ్‌జెడ్ క్యూహెచ్‌డీ + ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. వెనుకవైపు, 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ 900 ప్రైమరీ కెమెరాను అందిస్తోంది. 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్858 టెలిఫోటో లెన్స్ 3.2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50ఎంపీ పెరిస్కోప్ లెన్స్‌తో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, అల్ట్రావైడ్ 50ఎంపీ సెన్సార్‌ను అందిస్తుంది. 32ఎంపీ సెల్ఫీ షూటర్‌ ను కలిగి ఉంటుంది.. ఈ ఫోన్‌లో ప్రత్యేక కెమెరా గ్రిప్, డెడికేటెడ్ షట్టర్ రిలీజ్ బటన్‌ను కనెక్ట్ అయ్యేలా యూజర్లను అనుమతిస్తుంది. యూఎస్‌బీ-సి ద్వారా గ్రిప్ ఫోన్‌కి అందిస్తుంది…

ఇక ధర విషయానికొస్తే.. షావోమీ 14 అల్ట్రా 90డబ్ల్యూ ఛార్జ్ చేయగల పెద్ద 5,300ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. షావోమీ 14 ప్రో మోడల్ 120డబ్ల్యూ ఛార్జింగ్ కన్నా కొంచెం స్లోగా ఉంటుంది. 80డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీని అందించే ఒక వేరియంట్‌లో మాత్రమే వస్తుంది.. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. దాదాపు రూ. 1,34,500 ఉంటుందని అంచనా వేస్తున్నారు..