Leading News Portal in Telugu

Vivo V30 Pro launch: వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే..



Viviii

ప్రముఖ మొబైల్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే ఫోన్లను వదులుతుంది.. తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతుంది. వివో నుంచి వి30, వివో వి30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు మార్చి 7న లాంచ్ కానున్నాయి.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఒక్కసారి చూద్దాం..

ఆన్లైన్లో లీక్ అయిన వివరాల మేరకు.. ఈ ప్రో వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీని ఎంచుకుంటుంది. వివో వి30 ఇండోనేషియన్ వేరియంట్ 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ను అందిస్తుంది. అయితే, వి30 ప్రో మోడల్ 12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారంగా ఫన్‌టచ్ఓఎస్ 14పై రన్ అవుతున్నాయి. చివరగా, 80డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది..

అలాగే 6.78-అంగుళాల కర్వడ్1.5కె అమోల్డ్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 300హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2,800 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తాయి.. ఇక కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు పండగే.. ఓఐఎస్ సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో మరో 50ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరోవైపు, వివో వి30 ప్రో ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌కు 50ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్‌ను అందిస్తుంది.. మొత్తంగా చూసుకుంటే కెమెరా బాగుందని తెలుస్తుంది.. ఇక ధర ఎంత అనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.. కేవలం ఫీచర్స్ ఒక్కటే కనిపిస్తున్నారు.. మరో రెండు రోజుల్లో ఈ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల కాబోతున్నాయి..