
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పొ ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ కలిగిన ఒప్పో A3 ప్రో మొబైల్స్ ను లాంచ్ చేశారు.. A సిరీస్ హ్యాండ్‌సెట్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్తో అమర్చింది.. 6.7 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 64ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ ను, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 14పై ఒప్పో కలర్ఓఎస్ 14 స్కిన్‌తో రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో రాబోతుంది. సెల్ఫీ ప్రియులకు ఈ ఫోన్ స్పెషల్ గా నిలుస్తుంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు ఎఫ్/1.7 ఎపర్చరుతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో పాటు ఎఫ్/2.4 ఎపర్చరు ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం ఎఫ్/2.0 ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరాను కలిగి ఉంది.. ఇక సెన్సార్ ను కలిగి ఉండటం మాత్రమే కాదు.. వాటర్ ఫ్రూఫ్ గా రాబోతుంది..
ధర విషయానికొస్తే.. ఒప్పో A3 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో బేస్ మోడల్ ధర రూ.1,999 గా ఉంది. ఈ ఫోన్ 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ కాన్ఫిగరేషన్లలో కూడా అందుబాటులో ఉంది. స్టోరేజ్ ను బట్టి ధర కూడా పెరుగుతుంది.. ఇక అలాగే ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది.. అలాగే అజూర్ , క్లౌడ్ బ్రోకేడ్ పౌడర్, మౌంటైన్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.. ఏప్రిల్ 19 నుంచి ఈ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి..