- మార్కెట్లోకి మోటో 5జీ స్మార్ట్‌ఫోన్
- జూన్ 24 నుంచి అమ్మకాలు
- వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్

Motorola Edge 50 Ultra Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ ఇటీవల కాలంలో వరుసగా 5జీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. మోటో ఎడ్జ్ 40, మోటో ఎడ్జ్ 40 నియో, మోటో ఎడ్జ్ 50, మోటో ఎడ్జ్ 50 ప్రోల ఇప్పటికే విడుదల చేసింది. ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా నేడు (జూన్ 18) ‘మోటో ఎడ్జ్ 50 అల్ట్రా’ను లాంచ్ చేసింది. ఈ ప్రీమియం ఫోన్ జూన్ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా వెబ్సైట్లతో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
Motorola Edge 50 Ultra Price:
మోటో ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సింగిల్ వేరియంట్లో తీసుకొచ్చింది. 12జీబీ+512జీబీ మోడల్ ధర రూ.59,999గా ఉంది. ఎర్లీ బర్డ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ అనంతరం ఈ ఫోన్ రూ.49,999కే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ధర కొన్ని రోజలు మాత్రమే అని మోటోరొలా పేర్కొంది. ఎడ్జ్ 50 అల్ట్రా మూడు రంగుల్లో (ఫారెస్ట్ గ్రే, పీచ్ ఫజ్, నార్డిక్ వుడ్) లభిస్తుంది.
Motorola Edge 50 Ultra Sepcs:
మోటో ఎడ్జ్ 50 అల్ట్రాలో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ 1.5కె డిస్ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేటు, 2500 పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను ఎడ్జ్ 50 అల్ట్రాలో ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3తో పనిచేయనున్న ఈ ఫోన్.. అవుటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తోంది.
Motorola Edge 50 Ultra Canera & Battery:
మోటో ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సర్, 64 ఎంపీ టెలిఫొటో లెన్స్, 50 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.