Leading News Portal in Telugu

Amazon Prime Day Sale 2024: ప్రైమ్‌ డే సేల్‌లో అమ్మకానికి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే!


  • అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ 2024
  • అమ్మకానికి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
  • భారీగా డిస్కౌంట్లు
Amazon Prime Day Sale 2024: ప్రైమ్‌ డే సేల్‌లో అమ్మకానికి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే!

New 5G Smartphones Sale in Amazon Prime Day Sale 2024: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ‘అమెజాన్‌’ ప్రైమ్‌ డే సేల్‌ 2024 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్‌ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్న ఈ సేల్.. జులై 20, 21 తేదీల్లో కొససాగనుంది. ఈ సేల్‌లో 450 కంటే ఎక్కువ బ్రాండ్‌ల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్, ల్యాప్‌టాప్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా భారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి. అలానే ఈ సేల్ సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని కూడా అమెజాన్‌ పేర్కొంది.


శాంసంగ్‌, ఐకూ, హానర్, లావా, మోటోరోలా, వన్‌ప్లస్‌ నుంచి లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ 2024లో అమ్మకాన్ని ఉండనున్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ ఎం35, ఐకూ జెడ్9 లైట్ 5జీ ఫోన్‌లు జూలై 17న భారతదేశంలో లాంచ్ కానున్నాయి. ఇవి అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో విక్రయించబడతాయి. హానర్ 200, హానర్ 200 ప్రో ఫోన్‌లు కూడా జూలై 18న భారత్‌లో లాంచ్ కానున్నాయి. ప్రైమ్ డే సేల్‌లో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

లావా బ్లేజ్ ఎక్స్ జూలై 10న భారత్‌లో విడుదల కానుంది. ఈ ఫోన్ ప్రైమ్‌ డే సేల్‌ 2024 సమయంలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రాకూడా అమ్మకాన్ని వస్తోంది. ఈ సేల్‌లో పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు. 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.99,999గా ఉండగా.. సేల్‌ సమయంలో రూ.10వేలు తగ్గింపు లభించనుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్ అల్ట్రా ఆరెంజ్ కలర్‌ వేరియంట్‌లో అమ్మకానికి రానుంది. వన్‌ప్లస్‌ 12ఆర్‌, రెడ్‌మీ 13, రియల్‌మీ జీటీ 6టీ కొత్త కలర్‌ వేరియంట్‌లో అమ్మకానికి ఉంటాయి.