Leading News Portal in Telugu

CMF Watch Pro 2 Price: సీఎంఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్, బడ్స్‌.. ధర, ఫీచర్స్ ఇవే!


CMF Watch Pro 2 Price: సీఎంఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్, బడ్స్‌.. ధర, ఫీచర్స్ ఇవే!

CMF Watch Pro 2 Release Date and Price in India: ‘వన్‌ప్లస్‌’ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌ పై స్థాపించిన బ్రాండ్‌ ‘నథింగ్‌’ అన్న విషయం తెలిసిందే. నథింగ్‌ సబ్‌బ్రాండ్ అయిన ‘సీఎంఎఫ్‌’ తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం భారత్‌లో విడుదల చేసింది. ‘సీఎంఎఫ్‌ ఫోన్‌ 1’ పేరిట ఫోన్‌ను సోమవారం రిలీజ్ చేసింది. ఫోన్‌తో పాటుగా స్మార్ట్‌ వాచ్, బడ్స్‌లను కూడా సీఎంఎఫ్‌ విడుదల చేసింది. వీటి ధర, ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

వాచ్‌ ప్రో 2 పేరుతో స్మార్ట్‌ వాచ్‌ను సీఎంఎఫ్‌ విడుదల చేసింది. ఇది 1.32 ఇంచెస్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ వాచ్ ధర రూ.4999గా కంపెనీ నిర్ణయించారు. వీగన్‌ లెదర్‌ ఆప్షన్‌తో కూడిన వాచ్‌ ధర రూ.5,499గా ఉంది. దీంతో పాటు బడ్స్‌ ప్రో 2 పేరుతో టీడబ్ల్యూఎస్‌ను కూడా సీఎంఎఫ్‌ లాంచ్‌ చేశారు. 50డీబీ హైబ్రిడ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో సపోర్ట్‌తో వస్తోంది. దీని ధర రూ.4,299గా ఉంది. క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ 2.0, విండ్‌ నాయిస్‌ రిడక్షన్ 2.0తో వస్తోంది. స్మార్ట్‌ వాచ్, బడ్స్‌లు జులై 12 నుంచి సేల్‌కు వస్తాయి. సీఎంఎఫ్‌ వెబ్‌సైట్‌, ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.