Leading News Portal in Telugu

Lava Yuva Star Price: లావా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ! ధర 7 వేలే


  • లావా నుంచి స్మార్ట్‌ఫోన్‌
  • 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ
  • 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్
Lava Yuva Star Price: లావా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ! ధర 7 వేలే

Lava Yuva Star 4G Smartphone Launch and Price: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘లావా’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ‘లావా యువ స్టార్‌’ పేరుతో మంగళవారం భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో శక్తివంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్.. 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ఫోన్ కొనుగోలు చేసేవారి కోసం కంపెనీ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా యువ 5Gని కంపనీ ఈ ఏడాది మేలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

లావా యువ స్టార్‌ స్మార్ట్‌ఫోన్‌ ఒకే వేరియెంట్‌లో అందుబాటులో ఉంది. 4జీబీ+64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ వైట్, బ్లాక్ మరియు లావెండర్ రంగులలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లావా వెబ్ సైట్, ఈ కామర్స్ సైట్‌లలో కొనుగోలు చేయొచ్చు.

లావా యువ స్టార్‌ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ స్క్రీన్ ఉండగా.. 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. UniSoC 9863A ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్స్ కెమెరా ఉండగా.. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. అది 10 వాట్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.