Leading News Portal in Telugu

Amazon: ఆపిల్ మ్యాక్ బుక్ పై బంపర్ ఆఫర్.. దాదాపు రూ.47 వేల తగ్గింపు


  • అమెజాన్ లో మ్యాక్‌బుక్‌పై బంపర్ ఆఫర్
  • అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్
  • ఈ సేల్‌లో.. వివిధ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇతర ఉత్పత్తులపై తగ్గింపులు
  • రూ.47 వేలకే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1
Amazon: ఆపిల్ మ్యాక్ బుక్ పై బంపర్ ఆఫర్.. దాదాపు రూ.47 వేల తగ్గింపు

అమెజాన్ లో మ్యాక్‌బుక్‌పై బంపర్ ఆఫర్ నడుస్తోంది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1పై ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి.. అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో, వివిధ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇతర ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రీమియం ల్యాప్‌టాప్‌ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

READ MORE: Bhadrachalam Rains: భద్రగిరిని ముంచెత్తిన వాన.. అన్నదాన సత్రంలోకి వరద నీరు..

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1 పాతది కావచ్చు.. కానీ ఇందులో ఇతన Windows ల్యాప్‌టాప్‌ల కంటే మెరుగైన బ్యాటరీ జీవితాన్ని, పనితీరును పొందుతారు. ఈ పరికరం ప్రస్తుతం అమెజాన్‌లో 29 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని ధర రూ.99,990 నుంచి రూ.66,990కి తగ్గింది. ఇది కాకుండా.. అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించడంపై వినియోగదారులు రూ.3,349 తగ్గింపును పొందుతారు. మీ పాత ల్యాప్‌టాప్‌ను మార్పిడి చేసుకుంటే.. మీకు రూ.11,000 వరకు విలువ లభిస్తుంది. అన్ని డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాల కలిపి ఈ ల్యాప్‌టాప్ రూ. 52,641కే వస్తుంది.

READ MORE:Seetharama Project: రైతులకు పండగే.. పంద్రాగస్టు రోజు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం..

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1లో 49.9Wh బ్యాటరీ ఉంది. 30W USB-C పవర్ అడాప్టర్ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 18 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఇందులో ఆపిల్ ఎమ్1 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 8 కోర్ CPUతో వస్తుంది. ఇది మునుపటి తరం కంటే 3.5 రెట్లు మెరుగైన పనితీరును కలిగి ఉంది. ఇది కాకుండా.. ఇందులో 8GB RAM అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ 13.3-అంగుళాల రెటీనా డిస్‌ప్లేతో వస్తుంది. పరికరం 256GB నిల్వను కలిగి ఉంది. దీనిని 2TB వరకు విస్తరించవచ్చు. కీబోర్డ్ బ్యాక్‌లిట్‌తో వస్తుంది. ఇది 720P FaceTime HD కెమెరాను కలిగి ఉంది.