Leading News Portal in Telugu

OnePlus Buds Pro 3 Price: ‘వన్‌ప్లస్‌’ బడ్స్‌ ప్రో 3 రిలీజ్.. 43 గంటల బ్యాటరీ లైఫ్‌! ప్రత్యేకతలు ఇవే


OnePlus Buds Pro 3 Price: ‘వన్‌ప్లస్‌’ బడ్స్‌ ప్రో 3 రిలీజ్.. 43 గంటల బ్యాటరీ లైఫ్‌! ప్రత్యేకతలు ఇవే

OnePlus Buds Pro 3 Launch and Price in India: ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్‌’నుంచి బడ్స్‌ ప్రో 3 భారత్‌లో విడుదలయ్యాయి. ఈ యర్‌బడ్స్‌ విక్రయం ఆగస్టు 23 మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. వీటి ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ల్యూనార్‌ రేడియన్స్‌, మిడ్‌నైట్‌ ఓపస్‌ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 10, వన్‌ప్లస్‌ 11, వన్‌ప్లస్‌ 12 సిరీస్‌ ఫోన్లను రెడ్‌ కేబుల్‌ క్లబ్‌తో అనుసంధానిస్తే.. రూ.1,000 తగ్గింపు కూపన్‌ లభిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో 3ను కొనుగోలు చేస్తే మరో రూ.1,000 తగ్గుతుంది. వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్స్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, రిలయన్స్‌, క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌, బజాజ్‌, విజయ్‌ సేల్స్‌ వంటి ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ బడ్స్‌ లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్‌లో నాయిస్‌ క్యాన్సిలేషన్‌, స్పేషియల్‌ ఆడియో, సూపర్ సౌండ్‌ క్వాలిటీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో 3లోని ఒక్కో ఇయర్‌బడ్‌ రెండు డిజిటల్‌-టు-అనలాగ్‌ కన్వర్టర్లతో వస్తోంది. బడ్స్‌ ప్రో 2 తరహాలోనే ఇందులో కూడా డ్రైవర్‌ టెక్నాలజీ ఇచ్చారు. అయితే ప్రతి అంశంలో మరింత ఉన్నతీకరించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో రెండు మ్యాగ్నెట్లతో కూడిన 11ఎంఎం వూఫర్‌ ఉన్నట్లు పేర్కొంది. ఇది 50db వరకు నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే టైప్‌-సి పోర్ట్‌ ఉంటుంది. కేస్‌తో కలిసి 43 గంటల బ్యాటరీ లైఫ్‌ లభిస్తోంది. గూగుల్‌ స్పేషియల్‌ ఆడియో, బ్లూటూత్‌ 5.4, గూగుల్‌ ఫాస్ట్‌ పెయిర్‌ వంటివి సపోర్ట్‌ చేస్తాయి.