- టెక్ ప్రియులకు శుభవార్త
- సెప్టెంబర్ 10న ఈవెంట్
- సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి ఫోన్స్

Apple iPhone 16 Launch Date: టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన సమయం ఆసన్నమవుతోంది. ‘యాపిల్’ ఐఫోన్ 16 ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. అధికారిక తేదీని యాపిల్ కంపెనీ ఇంకా ప్రకటించకున్నా.. సెప్టెంబర్ 10వ తేదీన ఈవెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ రెండో వారంలో ఈవెంట్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది సెప్టెంబర్ 12న ఈవెంట్ నిర్వహించగా.. అంతకుముందు ఏడాది సెప్టెంబర్ 7న కండక్ట్ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 10న ఈవెంట్ జరిగే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 10న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఈవెంట్ జరగనుండగా.. సెప్టెంబర్ 20 నుంచి ఫోన్లను అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి కూడా నాలుగు ఫోన్లు రిలీజ్ కానున్నాయి. స్టాండర్డ్ వేరియంట్ ఐఫోన్ 16తో ఐఫోన్ 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను యాపిల్ తీసుకురానుంది. యాపిల్ ఏ18 ప్రో చిప్‌సెట్‌తో ఇవి వచ్చే అవకాశం ఉంది. ఈ నాలుగు ఫోన్లూ వేర్వేరు సైజుల్లో, వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలతో రానున్నాయి. త్వరలోనే ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.