Leading News Portal in Telugu

iPhone 15 Plus Price: ఐఫోన్‌ 15 ప్లస్‌పై 14 వేల తగ్గింపు.. అదనంగా బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్!


  • త్వరలోనే ఐఫోన్‌ 16 సరీస్‌
  • ఐఫోన్‌ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్
  • 25 వేలకే సొంతం చేసుకోవచ్చు
iPhone 15 Plus Price: ఐఫోన్‌ 15 ప్లస్‌పై 14 వేల తగ్గింపు.. అదనంగా బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్!

15 Percent Discount on iPhone 15 Plus in Flipkart: త్వరలోనే యాపిల్ ఐఫోన్‌ 16 సరీస్‌ లాంచ్‌ కానుంది. కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో సెప్టెంబర్‌ 9న యాపిల్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈ వెంట్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌ సహా యాపిల్‌ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. కొత్త సిరీస్ వస్తున్న నేపథ్యంలో ఎప్పటిలానే యాపిల్ పాత మోడల్స్‌పై భారీ ఆఫర్లు అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

యాపిల్ ఐఫోన్‌ 15 ప్లస్‌ ఫోన్‌ అసలు ధర రూ.89,600గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.75,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు దాదాపుగా రూ.14,000 ఆదా చేసుకోవచ్చు. పలు బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ.74,999కి పొందొచ్చు.

ఐఫోన్‌ 15 ప్లస్‌పై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్‌ఛేంజ్‌లో రూ.50,850 వరకు పొందొచ్చు. అయితే మీ పాత ఐఫోన్‌ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుంటేనే ఇంత మొత్తం లభిస్తుంది. అన్ని ఆఫర్లు (ఫ్లిప్‌కార్ట్‌, బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్‌) కలుపుకుంటే ఐఫోన్‌ 15 ప్లస్‌ ఫోన్‌ను మీరు రూ.25 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.