Leading News Portal in Telugu

WhatsApp Third-Party Chats: త్వరలో అందుబాటులోకి వాట్సాప్ థర్డ్-పార్టీ చాట్స్ ఫీచర్..


  • వాట్సాప్ థర్డ్-పార్టీ మెసేజింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని మోటా ప్లాన్..

  • వాట్సాప్.. మెసింజర్ ని ఉపయోగిస్తున్న వ్యక్తులు థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలను జత చేసుకోవాలి..

  • యూరప్ దేశాల్లో తొలుత ప్రవేశ పెట్టిన తర్వాత భారత్ లోకి ఈ సేవలు అందుబాటులోకి రానుంది..
WhatsApp Third-Party Chats: త్వరలో అందుబాటులోకి వాట్సాప్ థర్డ్-పార్టీ చాట్స్ ఫీచర్..

WhatsApp Third-Party Chats: మోటా థర్డ్-పార్టీ మెసేజింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. త్వరలో ఇతర యాప్‌లతో వాట్సాప్ చాట్‌లను షేర్ చేయబోతుంది. థర్డ్-పార్టీ చాట్‌ల అప్‌డేట్‌తో వస్తున్నట్లు మెటా తన అధికారిక బ్లాగ్‌లో వివరించింది. మెసింజర్, వాట్సాప్‌లో థర్డ్-పార్టీ చాట్ అనుభవాన్ని సృష్టించాలనుకుంటున్నట్లు కంపెనీ పేర్కొనింది. ఈ అప్‌డేట్‌తో మీరు చాట్‌లను షేర్ చేయడమే కాకుండా వీడియో, ఆడియో కాల్స్ రిక్వెస్ట్‌లను కూడా షేర్ చేసుకోవచ్చు అన్నమాట.

అయితే, డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA) యాప్‌లను ఇంటర్‌ఆపరేబుల్‌గా మార్చడాన్ని తప్పనిసరి చేసిన తర్వాత ఈ కొత్త వ్యూహం వచ్చినట్లు మెటా తెలిపింది. డిజిటల్ మార్కెట్ల చట్టం ప్రకారం, యూరప్‌లో వాట్సాప్, మెసింజర్ ని ఉపయోగిస్తున్న వ్యక్తులు థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలను జత చేసుకోవాలి అని సూచనలు జారీ చేసింది. అయితే, ఈ థర్డ్-పార్టీ చాట్‌లను ఎలా పరిచయం చేయబోతున్నారనే దానిపై తాము ఇప్పటికే పరిశోధన దశలో ఉన్నామని మోటా చెప్పుకొచ్చింది.

ఇక, థర్డ్-పార్టీ చాట్‌ల గురించి మీకు తెలియజేసే నోటిఫికేషన్‌లను కూడా మోటా పరిచయం చేస్తుంది. అలాగే, కొత్త అప్‌డేట్ వినియోగదారుల ఆన్‌బోర్డింగ్ ఫ్లోను సులభతరం చేస్తుంది. కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలనే దానిపై సూచనలు చేయనుంది. ఉదాహరణకు మీరు వాట్సాప్, మెసింజర్ రెండింటికీ కలిపి వినియోగించుకునే ఛాన్స్ ఉంది.. వేరు వేరుగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మెసెంజర్, వాట్సాప్ రెండింటినీ ఇంటర్‌ఆపరేబుల్ చేయడానికి ప్లాన్ చేయడమే కాకుండా.. దానిని సురక్షితంగా ఉంచడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెటా పేర్కొంది. అయితే, భారతదేశంలో ఫీచర్‌ను రిలీజ్ చేసేందుకు ఇంకా తేదీలను ప్రకటించలేదు. ఐరోపా దేశాలలో అమలు చేసిన తర్వాత భారత్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.