Leading News Portal in Telugu

Samsung Galaxy M55s Price: శాంసంగ్ సరికొత్త ఫోన్‌.. ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలతో ఒకేసారి వీడియో తీయొచ్చు!


  • శాంసంగ్ సరికొత్త ఫోన్‌
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 26 నుంచి అమ్మకాలు ప్రారంభం
Samsung Galaxy M55s Price: శాంసంగ్ సరికొత్త ఫోన్‌.. ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలతో ఒకేసారి వీడియో తీయొచ్చు!

Samsung Galaxy M55s 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘శాంసంగ్‌’ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్‌ చేసింది. ఎం సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ ఎం55 ఎస్‌’ పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. గతంతో ఎం55, ఎఫ్‌55 ఫోన్లను తీసుకొచ్చిన శాంసంగ్.. చిన్న చిన్న మార్పులతో ఎం55 ఎస్‌ను ఆవిష్కరించింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలతో ఒకేసారి వీడియోను రికార్డు చేయొచ్చు. శాంసంగ్ ఎం55 ఎస్‌ ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

శాంసంగ్‌ ఎం55ఎస్‌ ఫోన్ 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ఎస్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. మరో రెండు వేరియంట్లు ఉన్నా.. వాటి ధరలను మాత్రం శాంసంగ్‌ ఇంకా వెల్లడించలేదు. కోరల్‌ గ్రీన్‌, థండర్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్లలో సెప్టెంబర్‌ 26 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులతో కొనుగోల చేస్తే.. రూ.2 వేలు డిస్కౌంట్ పొందొచ్చు.

శాంసంగ్‌ ఎం55ఎస్‌లో 6.7 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేటుకు ఇది సపోర్ట్‌ చేస్తుంది. 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్ 1 ప్రాసెసర్‌ ఉన్నాయి. వెనుకవైపు 50 ఎంపీ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ అమర్చారు. ఫ్రంట్‌ సైడ్ కూడా 50 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 45 వాట్స్ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.