Leading News Portal in Telugu

Huge discount on Samsung 108 cm (43 inches) Full HD Smart LED TV


  • 43 అంగుళాల‌ సామ్ సంగ్ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్
  • అమెజాన్ లో 39 శాతం తగ్గింపు ప్రకటించింది
  • మతిపోయే ఫీచర్లు
Samsung Smart TV: ఇది కదా డీల్ అంటే?.. 43 అంగుళాల‌ సామ్ సంగ్ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్

సాధారణ టీవీలు దాదాపు కనుమరుగై పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ టీవీలదే హవా. ఆండ్రాయిడ్ యాప్స్, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. చిన్నదో, పెద్దదో మొత్తానికి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని ఫిక్స్ అవుతున్నారు జనాలు. టీవీ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అంతే కాదు పండగలు, ప్రత్యేక సేల్స్ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 43 అంగుళాల‌ సామ్ సంగ్ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్ అందిస్తోంది.

Samsung 108 cm (43 inches) Full HD Smart LED TV UA43T5450AKXXL (Black)పై అమెజాన్ లో 39 శాతం తగ్గింపు ప్రకటించింది. ఈ టీవీ అసలు ధర రూ. 40,400గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 24,490కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే వచ్చేస్తోంది. బ్రాండెడ్ టీవీపై ఇంతకంటే మంచి డీల్ ఉండదేమో. కొత్త టీవీ కొనాలనుకునే వారు ఈ స్మార్ట్ టీవీపై ఓ లుక్కేయండి.

Samsung (43 inches) Full HD Smart LED TV ఫీచర్ల విషయానికి వస్తే.. 43 అంగుళాల స్క్రీన్ సైజ్ తో వస్తుంది. LED డిస్ప్లే టెక్నాలజీ అందించారు. రిజల్యూషన్ 1080p, రిఫ్రెష్ రేట్ 50 Hzతో వస్తుంది. ఇందులోని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే.. ఫుల్ HD రిజల్యూషన్, పర్ కలర్, ఒక రిమోట్ ఫంక్షన్. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5, జియో సినిమా వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ టెక్నాలజీ RF, Wi-Fi, USB, ఈథర్నెట్, HDMI అందించారు. ల్యాప్‌టాప్/PCలు/గేమింగ్ కన్సోల్/హోమ్ థియేటర్ లతో కనెక్ట్ చేసుకోవచ్చు. 20 వాట్స్ పవర్ ఫుల్ అవుట్ పుట్ సౌండ్ ను ఇస్తుంది. పవర్ ఫుల్ స్పీకర్స్ ను అందించారు. వెబ్ బ్రౌజర్, వైఫై డైరెక్ట్, స్మార్ట్‌థింగ్స్, స్క్రీన్ మిర్రరింగ్, గేమ్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లు కలిగి ఉంది.