Leading News Portal in Telugu

Center issues high-risk warning to Google Chrome users


  • గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు అలర్ట్
  • హై-రిస్క్ వార్నింగ్‌ ఇచ్చిన కేంద్రం
  • Windows, Linux లేదా Macలో Google Chromeని ఉపయోగిస్తుంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాల్సిందే
Google Chrome: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు అలర్ట్.. హై-రిస్క్ వార్నింగ్‌ ఇచ్చిన కేంద్రం..!

సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను యూజ్ చేయని వారుండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ చేస్తుంటారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు Windows, Linux లేదా Macలో Google Chromeని ఉపయోగిస్తుంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాల్సిందే. లేకపోతే సైబర్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్ లో క్లిష్టమైన భద్రతా లోపాల గురించి ప్రభుత్వం హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది.

యూజర్లను గూగుల్ క్రోమ్ ను అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది. గూగుల్ క్రోమ్ లోని లోపాలతో హ్యాకర్స్ ఎటాక్ చేసే ఛాన్స్ ఉందని తెలిపింది. యూజర్ల డేటా, సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉంటుందని సెర్ట్ తెలిపింది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అప్ డేట్ తప్పనిసరి అని సూచించింది. పీసీలు, ల్యాప్‌టాప్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ యూజర్స్‌తో పాటు మాక్‌ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద ప్రమాదమేమీ ఉండకపోవచ్చని చెప్పింది. 132.0.6834.83/8r, 132.0.6834.110/111కు ముందు వెర్షన్‌ గూగుల్‌ క్రోమ్‌ని వాడుతున్నట్లయితే తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయాల్సిందేనని సెర్ట్‌ చెప్పింది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ యూజర్లు 132.0.6834.110 వెర్షన్‌కు ముందు క్రోమ్‌ వాడుతున్నట్లయితే.. లేటెస్ట్‌ వెర్షన్‌కు మారాలని పేర్కొంది.