Leading News Portal in Telugu

14 crore tablets sold in 2024.. These are the most sold ones..!


  • 2024లో టాబ్లెట్‌లు తిరిగి ట్రెండ్‌లోకి
  • 2020 తర్వాత టాబ్లెట్‌ల అమ్మకాలు
  • 2024లో ప్రపంచవ్యాప్తంగా 147.6 మిలియన్ (14.7 కోట్ల) టాబ్లెట్‌లు అమ్మకం.
Tablets Sold: 2024లో 14 కోట్ల టాబ్లెట్లు సేల్.. ఎక్కువగా అమ్ముడైనవి ఇవే..!

2024లో టాబ్లెట్‌లు తిరిగి ట్రెండ్‌లోకి వచ్చాయి. 2020 తర్వాత టాబ్లెట్‌ల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. కెనాలిస్ తాజా నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 147.6 మిలియన్ (14.7 కోట్ల) టాబ్లెట్‌లు అమ్ముడయ్యాయని అంచనా. ఇది గత సంవత్సరం కంటే 9.2% ఎక్కువ. కార్పొరేట్ కస్టమర్ల ద్వారా పెరిగిన అప్‌గ్రేడ్‌లు దీనికి కారణమని కెనాలిస్ పేర్కొంది. 2024 సంవత్సరంలో ఏ కంపెనీ అత్యధిక టాబ్లెట్‌లను విక్రయించిందో తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా టాబ్లెట్లు అమ్ముడైన 5 బ్రాండ్లు ఇవే
1. ఆపిల్: 2024లో 38.6 శాతం మార్కెట్ వాటాతో 57 మిలియన్ ఐప్యాడ్‌లను విక్రయించింది. దీని వలన ఐప్యాడ్ అత్యధికంగా అమ్ముడైన టాబ్లెట్‌గా నిలిచింది. ఆపిల్ విజయానికి కారణం దాని AIతో కొత్త మోడళ్లను విడుదల చేయడం.. M4 చిప్‌తో ఐప్యాడ్ ప్రో, A17 ప్రో చిప్‌తో కొత్త ఐప్యాడ్ మినీ వంటివి.

2. శామ్‌సంగ్: 18.8 శాతం మార్కెట్ వాటాతో 27.7 మిలియన్ టాబ్లెట్‌లను రవాణా చేసింది. దీంతో.. శామ్‌సంగ్ రెండవ స్థానంలో నిలిచింది.

3. హువావే: 7.3 శాతం మార్కెట్ వాటాతో 10.7 మిలియన్ టాబ్లెట్లను రవాణా చేసింది. ఈ క్రమంలో.. మూడవ స్థానంలో నిలిచింది.

4. లెనోవో: 7.1 శాతం వాటాతో నాల్గవ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 2024లో లెనోవా 10.4 మిలియన్ టాబ్లెట్‌లను రవాణా చేసింది.

5. Xiaomi: 6.2 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద టాబ్లెట్ తయారీదారుగా అవతరించింది.