- బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను లక్ష్యంగా శాంసంగ్
- రెండు ఎంట్రీ లెవల్ 5G ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసిన శాంసంగ్
- గెలాక్సీ M06 5G మోడల్ అత్యంత తక్కువ ధరలో లభించగా, గెలాక్సీ M16 5G మోడల్ మరింత మెరుగైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులో.

Samsung Galaxy M06: శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు మోడల్స్ ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఎంట్రీ లెవల్ 5G ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ M06 5G మోడల్ అత్యంత తక్కువ ధరలో లభించగా, గెలాక్సీ M16 5G మోడల్ మరింత మెరుగైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది.
ఇక ఇందులో గెలాక్సీ M06 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా ఆకట్టుకునేలా రూపొందించబడింది. డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు, 4 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇందులో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నాయి.
ఇక ఈ హ్యాండ్ సెట్ లో కెమెరాను గమనిస్తే.. 50MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీ ఉండగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5G, 4G, బ్లూటూత్ 5.3, డ్యూయల్ బ్యాండ్ వైఫై, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ స్పెసిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Samsung Knox Vault సపోర్ట్ లాంటి భద్రత ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక 4GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ కేవలం రూ.9499కే లభిస్తుంది. మార్చి 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, శాంసంగ్ వెబ్‌సైట్, స్టోర్‌లలో సేల్ మొదలవుతుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా రూ.10వేల నుండి 15 వేల ధర రేంజ్‌లో ఎక్కువ మంది వినియోగదారులు ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంసంగ్‌తో పాటు రెడ్మీ, రియల్‌మీ, పోకో, ఐకూ, మోటరోలా, వివో వంటి కంపెనీలు సైతం బడ్జెట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. మొత్తంగా శాంసంగ్ తన గెలాక్సీ M సిరీస్‌లో కొత్తగా M06 5G, M16 5G మోడళ్లను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు, 5G కనెక్టివిటీ, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో ఈ ఫోన్లు Redmi, Realme, Poco, iQOO వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గెలాక్సీ M06 5G, గెలాక్సీ M16 5G ఉత్తమ ఎంపికలు.