Realme P3x 5G Sale Begins in India – Features 6000mAh Battery, 50MP Camera, and Dimensity 6400 Chipset
- భారత మార్కెట్లో P3 సిరీస్‌ను లాంచ్ చేసిన రియల్‌మి
- రియల్‌మి P3x 5G సేల్ మొదలు
- 6000mAhబ్యాటరీ, శక్తివంతమైన MediaTek Dimensity 6400 చిప్‌సెట్, 50MP కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్.

Realme P3x: రియల్‌మి ఇటీవల భారత మార్కెట్లో తన కొత్త P3 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి P3 ప్రో 5G, రియల్‌మి P3x 5G మోడల్స్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రో మోడల్ సేల్‌కు సిద్ధంగా ఉండగా.. తాజాగా రియల్‌మి P3x 5G సేల్ మొదలు పెట్టింది. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6000mAhబ్యాటరీ, శక్తివంతమైన MediaTek Dimensity 6400 చిప్‌సెట్, 50MP కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది.
మరి ఈ రియల్‌మి P3x 5G ధర, డిస్కౌంట్ ఆఫర్ల విషయానికి వస్తే.. 6GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.13,999 ఉండగా, 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.14,999 గా ఉంది. ఈ ఫోన్ స్టెల్లర్ పింక్, లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ పై అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.1000 తగ్గింపు లభిస్తుంది.
రియల్‌మి P3x 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్, వేగాన్ లెదర్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇక కెమెరా సెటప్ చూస్తే.. 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అపెర్చర్) + 2MP సెకండరీ లెన్స్, 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. MediaTek Dimensity 6400 చిప్‌సెట్ ప్రాసెసర్, Android 15 ఆధారిత Realme UI 6.0తో ఈ మొబైల్ అందుబాటులో ఉంటుంది.
ఇక ఇందులో ముఖ్యంగా చెప్పవలిసింది 6000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తాయి. 5G, 4G LTE, WiFi 5, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C, IP69 రేటింగ్ – డస్ట్, వాటర్ రెసిస్టెంట్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. మొత్తానికి రియల్‌మి P3x 5G, P3 ప్రో 5G ఫోన్లు తక్కువ ధరలో అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి. బడ్జెట్ 5G ఫోన్ కొనాలనుకునే వారికి 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లతో P3x 5G ఉత్తమ ఎంపిక. మరింత ప్రీమియం ఫీచర్లతో P3 ప్రో 5G కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు ఈ ఫోన్లను రియల్‌మి వెబ్‌సైట్ లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.