Leading News Portal in Telugu

Apple iPhone Fold phone to be launched soon reports say


  • యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు టాక్
  • 2026లో యాపిల్ ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్ లోకి
  • ప్రీమియం ధరలకు లాంచ్ అవుతుందని సమాచారం
Apple iPhone Fold: యాపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

గత కొంత కాలంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. Samsung, మోటరోలా, OnePlus వంటి బ్రాండ్‌లు ఇప్పటికే తమ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేశాయి. ఇప్పుడు యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు టాక్. Apple iPhone Fold ఫోన్ ను త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆపిల్ తీసుకొచ్చే ఫోల్డబుల్ ఫోన్ తో యాపిల్ ప్రొడక్ట్స్ కు క్రేజ్ మరింత పెరగనున్నది. అయితే యాపిల్ ఇప్పటివరకు ఫోల్డబుల్ ఫోన్‌ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ iPhone Fold పై నెట్టింటా జోరుగ చర్చ నడుస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్లు వార్తల్లో నిలుస్తున్నాయి. సామ్ సంగ్, చైనీస్ బ్రాండ్లు తమ ఫోల్డ్, ఫ్లిప్ ఫోన్‌లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇంకా తన ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేయలేదు. కానీ, 2026లో యాపిల్ ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు

యాపిల్ ఒక బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తుందని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 7.8-అంగుళాల క్రీజ్-ఫ్రీ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే బయటి డిస్‌ప్లే 5.5-అంగుళాలు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 9 నుంచి 9.5 మిమీ మందం ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు దాని మందం 4.5 మిమీ నుంచి 4.8 మిమీ వరకు తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ లెన్స్ వెనుక కెమెరా, మడతపెట్టిన, విప్పబడిన మోడ్‌ల కోసం ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇతర యాపిల్ ఫోన్‌ల మాదిరిగానే, ఈ హ్యాండ్‌సెట్ కూడా ప్రీమియం ధరలకు లాంచ్ అవుతుందని సమాచారం. Apple iPhone Fold హ్యాండ్‌సెట్ ధర $2000 (సుమారు రూ. 1.75 లక్షలు) నుంచి $2500 (సుమారు రూ. 2.17 లక్షలు) మధ్య ఉండొచ్చని సమాచారం.