- రియల్‌మి వినియోగదారులకు గుడ్ న్యూస్..
- రియల్‌మి 14 5g లాంచ్‌కు సిద్ధమంటూ అధికారికంగా పోస్టర్ టీజ్.

Realme 14 5g: రియల్‌మి వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ సంబంధించి అధికారికంగా టీజ్ చేసింది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఇక లీక్ అయినా వివరాలను బట్టి చూస్తే.. ఈ రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండనుందని రియల్‌మి షేర్ చేసిన ఫోటోల్లో వెల్లడైంది. ముఖ్యంగా సిల్వర్ కలర్ ఆప్షన్‌లో లభించనున్న ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది.
ఇక ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉండి, 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు అంచనా. ఇక ఈ రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో రానుంది. దీని వల్ల వీడియో ఎడిటింగ్, గేమింగ్ వంటి పనుల్లో మెరుగైన పెర్ఫార్మెన్స్ అందించనుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వంటి వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS ఆధారంగా పనిచేస్తూ.. 6000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో దీర్ఘకాలం బ్యాకప్ అందించనుంది. ఈ డివైస్ IP69 రేటింగ్‌తో వస్తోంది. అంటే ఇది దుమ్ము, ధూళి, నీరు వాటి నుండి రెసిస్టెంట్ గా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ కు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించబడింది.
The Mecha design of the realme 14 Series 5G is making its debut, showcasing a stunning blend of futuristic aesthetics and cutting-edge technology. Does it resonate with you?#realme14Series5G #PerformanceDominator pic.twitter.com/Cqc9Fk0kDb
— realme Global (@realmeglobal) March 12, 2025
రియల్‌మి 14 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటూ.. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా అందించబడనుంది. అందిన సమాచారం మేరకు పింక్, సిల్వర్, టైటానియం రంగుల్లో రియల్‌మి 14 5G లభించనుంది. మార్చి 19న రియల్‌మి P3 Ultra భారత మార్కెట్‌లో, రియల్‌మి 14 5G గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానున్నాయి. ఇక పూర్తి వివరాలను లాంచ్ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.