- సామ్ సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 9 వేల డిస్కౌంట్
- ఈ ఫోన్ పై 37 శాతం తగ్గింపు లభిస్తోంది
- 6000 mAh బ్యాటరీ

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం చూస్తున్నారా? అయితే టెక్ బ్రాండ్ సామ్ సంగ్ కు చెందిన ఫోన్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో SAMSUNG Galaxy M35 5G మొబైల్ పై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ పై 37 శాతం తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy M35 5G (6GB RAM,128GB) వేరియంట్ అసలు ధర రూ. 24,499గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 15,400కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే వచ్చేస్తోంది.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి HD+ sAMOLED డిస్ప్లేను కలిగి ఉంది. Exynos 1380 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం, Galaxy M35 5G ట్రిపుల్ రియర్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 MP ప్రధాన కెమెరా, 8 MP సెకండరీ కెమెరా, 2 MP సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం, 13 MP ఫ్రంట్ కెమెరా తో వస్తుంది.
6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత OneUI 6.1 OS పై రన్ అవుతుంది. రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ను అందించారు. ఈ ఫోన్ లో సైడ్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యాక్సిలరో మీటర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.