Leading News Portal in Telugu

Vivo launches new smartphone Vivo Y19e in India


  • ప్రీమియం లుక్ తో వివో నుంచి చౌకైన ఫోన్
  • 5500mAh బ్యాటరీ
  • ప్రారంభ ధర రూ. 7999
Vivo Y19e:5500mAh బ్యాటరీ.. ప్రీమియం లుక్ తో వివో నుంచి చౌకైన ఫోన్..

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారత్ లో తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Vivo Y19eని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ చౌక ధరలో అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ప్రీమియం లుక్ లో ఆకట్టుకుంటోంది. ఇది బడ్జెట్ ధరలో ఫోన్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. దీని ప్రారంభ ధర రూ. 7999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో అనేక AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫైడ్ పొందింది.

వివో Y19e టైటానియం సిల్వర్, మెజెస్టిక్ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. వివో వై19ఇ 6.74-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్లతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. Vivo Y19e లో Unisoc T7225 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అమర్చారు. ఇది 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వివో Y19e డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనికి 13MP డ్యూయల్ AI కెమెరా ఉంది. కెమెరా కోసం AI ఎరేస్, AI ఎన్‌హాన్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.