Leading News Portal in Telugu

Vivo Y39 5G Launched in India with Snapdragon 4 Gen 2, 6500mAh Battery


  • వివో Y సిరీస్‌లో భాగంగా విడుదలైన వివో Y39 5G మొబైల్.
  • 6.68-అంగుళాల HD+ LCD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 6500mAh బ్యాటరీ
  • 50MP వెనుక కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా, LED ఫ్లాష్ లతో పాటు.. 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
  • Snapdragon 4 Gen 2 ప్రాసెసర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి .
Vivo Y39 5G: 6.68 అంగుళాల 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీ ఫీచర్స్ తో వచ్చేసిన వివో Y39

Vivo Y39 5G: భారతీయ మొబైల్స్ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న వివో తాజాగా మరో మొబైల్ ను విడుదల చేసింది. వివో Y సిరీస్‌లో గత ఏడాది విడుదలైన వివో Y29 5Gకి అప్డేటెడ్ గా ఈ వివో Y39 5Gని తీసుక వచ్చింది. మరి ఈ మొబైల్ లోని సరికొత్త ఫీచర్స్ ను ఒకసారి చూద్దామా..

వివో Y39 5Gలో 6.68-అంగుళాల (1608 × 720 పిక్సెల్స్) HD+ LCD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ ను కలిగిన డిస్ప్లే కలిగి ఉంది. అలాగే ఇందులో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 4nm మొబైల్ ప్లాట్‌ఫామ్ అడ్రినో 613 GPUతో విడుదలైంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. f/1.8 అపెర్చర్‌తో 50MP వెనుక కెమెరా, f/2.4 అపెర్చర్‌తో 2MP పోర్ట్రెయిట్ కెమెరా, LED ఫ్లాష్ లతో పాటు.. f/2.0 ఎపర్చరుతో 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా అందించారు. ఇందులో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉపయోగించబడింది.

ఇక Y39 5G బ్లూవోల్ట్ టెక్నాలజీతో 6,500 mAh హై-డెన్సిటీ బ్యాటరీని కలిగి ఉంది మరియు 44W ఫ్లాష్‌ఛార్జ్ అలాగే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. దీనికి 5 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ హెల్త్ గ్యారెంటీ మద్దతు కూడా కలిగి ఉంది. ఇంకా ఇంత ఫీచర్స్ విషయానికి వస్తే.. USB టైప్-C ఆడియో, 400% వాల్యూమ్ యాంప్లిఫికేషన్‌తో బాటమ్-పోర్టెడ్ స్పీకర్, మిలిటరీ-గ్రేడ్ మన్నిక (MIL- STD-810H), దుమ్ము – నీటి నిరోధక (IP64)లతో విదుదల అయ్యింది. ఈ ఫోన్ Funtouch OS 15 తో వస్తుంది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. వివో Y39 5G లోటస్ పర్పుల్, ఓషన్ బ్లూ రంగులలో లభిస్తుంది. ఇక ఈ మొబైల్ 8GB + 128GB వేరియంట్ ధర 16,999 కాగా, 8GB + 256GB వేరియంట్ ను రూ. 18,999గా నిర్ణయించారు. ఈ మొబైల్ ను అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, అనేక ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంది.