Leading News Portal in Telugu

Vivo V50e A Stylish Smartphone with Powerful Features and Long Battery Life


  • స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచేయనున్న వివో V50e
  • 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో డిస్‌ప్లే.
  • 5600mAh బ్యాటరీ 90W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో
  • 50MP ప్రైమరీ కెమెరా తోపాటు, 8MP సెకండరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా అందుబాటులోకి.
Vivo V50e: అతి త్వరలో స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచేయనున్న వివో V50e

Vivo V50e: స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో కూడిన Vivo V50e భారతదేశంలో ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ ఫోన్ వినియోగదారులకు బెస్ట్ పనితీరును అందించడానికి రూపొందించబడింది. క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7300 చిప్, పెద్ద బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణలు. అంతేకాకుండా, ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం ‘Wedding Portrait Studio’ మోడ్‌ను అందించడంతో ఫోటోగ్రఫీ ప్రియులను మరింతగా ఆకర్షించనుంది.

ఈ Vivo V50e MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 2.5GHz క్లోక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో రావడంతో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, యాప్స్ ఉపయోగించడం వంటి పనులను ఇది తేలికగా నిర్వహించగలదు. ఇందులో 8GB RAM తోపాటు అదనంగా 8GB వర్చువల్ RAM సహాయంతో మొబైల్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమే ఉన్నప్పటికీ మెమొరీ కార్డు సపోర్ట్ అందిచకపోవడం ఒక మైనస్ అని చెప్పవచ్చు. కాబట్టి, సరైన వేరియంట్‌ను ఎంచుకోవడం అవసరం.

ఈ ఫోన్ 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో స్క్రోలింగ్, యానిమేషన్లు చాలా బాగా కనిపిస్తాయి. HDR10+ సపోర్ట్ తో రంగుల ప్రతిబింబం ఉత్తమంగా ఉంటుంది. వీటితోపాటు 4500 nits పీక్ బ్రైట్‌నెస్ తో వెలుపల కూడా మంచి వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక ఇందులో 5600mAh బ్యాటరీ దీని మరో ముఖ్యమైన ఫీచర్. దీని వల్ల రోజంతా చార్జింగ్ గురించి ఆలోచన అవసరం ఉండదు. తక్కువ సమయంలోనే 90W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో వేగంగా చార్జ్ అవుతుంది. అదనంగా, రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఇతర గాడ్జెట్‌లను కూడా చార్జ్ చేయవచ్చు.

Vivo V50e డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా తోపాటు, 8MP సెకండరీ కెమెరా ఉంటాయి. అలాగే 50MP సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ లవర్స్‌కు అదనపు ప్రయోజనం అందిస్తుంది. భారతదేశంలో Vivo V50e ధర రూ. 26,990 గా నిర్ణయించబడింది (8GB+128GB వేరియంట్). ఎక్కువ స్టోరేజ్ కోరుకునేవారు 8GB+256GB వేరియంట్ కోసం రూ.29,990 చెల్లించాల్సి ఉంటుంది.