- సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గిబ్లీ స్టైల్ ఫోటోలు.
- ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా గిబ్లీ స్టైల్ ఫోటోలు పొందడం చాలా సులువు.
- సులువైన స్టెప్స్ వాడి మీ గిబ్లీ స్టైల్ ఫోటోలు పొందండి.

Ghibli Images: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ AI టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలోనే తమ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ స్టైల్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియో. ఇకపోతే, గిబ్లీ స్టైల్ ఫోటో ఎలా సృష్టించాలని చాలా మందికి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. నిజానికి గిబ్లీ స్టైల్ ఫోటోలను తయారు చేయడం చాలా సులభం. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా.. కేవలం ఈ స్టెప్స్ ఫాలో అయితే స్టెప్స్ ఫాలో అయితే చాలు. మరి మీ ఫోటోలను గిబ్లీ స్టైల్ ఫోటోలుగా ఎలా మార్చాలో చూద్దామా..
ఇందుకోసం మొదటగా చాట్ జీపీటీ chat.openai.com ఓపెన్ చేసి అందులో అకౌంట్ లాగిన్ చేయండి. ఆపై GPT-40 ను ఎంచుకోండి. అక్కడ “+” (ప్లస్) ఐకాన్ పై క్లిక్ చేసి మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి. మీ ఫోటో అప్లోడ్ చేశాక గిబ్లీ స్టైల్ అప్లై చేయండి. ఇందుకోసం “Ghiblify this” లేదా “Turn this image into Studio Ghibli theme” అని రాయండి. ఆ తర్వాత మీ ఫోటోను చాట్ జీపీటీకీ అందించండి. ఇక అంతే.. కేవలం కొన్ని క్షణాల్లో AI మీ ఫోటోను అద్భుతమైన గిబ్లీ స్టైల్ చిత్రంగా మార్చి అందిస్తుంది.
ఇలా వచ్చినవి మీకు నచ్చితే డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే మీకు కావాల్సిన రంగులు, స్టైల్ లో ఇవ్వమని మళ్లీ అడగండి. ఇలా పూర్తి స్థాయిలో వివరాలను అందించి మీకు కావలిసిన ఫోటోను పొందండి. ఇలా మొత్తంగా ఉచిత వినియోగదారులు రోజుకు 3 ఫోటోలు మార్చగలరు. అదే ప్రీమియం సభ్యత్వం ద్వారా మీకు కావలిసినన్ని ఫోటోలను ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఫోటోలను గిబ్లీ స్టైల్ లోకి మర్చి చూసి ఎంజాయ్ చేయండి.