Leading News Portal in Telugu

Thomson QLED TVs with Linux OS launched in India


  • ప్రపంచంలోనే మొట్టమొదటి 24-అంగుళాల QLED స్మార్ట్ టీవీ విడుదల
  • ధర కేవలం రూ. 6,799
  • JioHotstar, YouTube, Prime Video, Sony Liv, Zee5 వంటి ప్రముఖ OTT యాప్‌లకు సపోర్ట్
Thomson QLED TV: ప్రపంచంలోనే మొట్టమొదటి 24-అంగుళాల QLED స్మార్ట్ టీవీ విడుదల.. ధర కేవలం రూ. 6,799

థామ్సన్ భారతదేశంలో తన కొత్త QLED Linux (కూలిటా 3.0) OS శ్రేణి టీవీలు, ఎయిర్ కూలర్లను విడుదల చేసింది. ఈ టీవీ లైనప్‌లో 24-అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 24-అంగుళాల QLED (Linux) స్మార్ట్ టీవీ. ఈ టీవీలు ఆకట్టుకునే డిజైన్, VA డిస్ప్లే ప్యానెల్, 36W వరకు సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇవి ప్రముఖ OTT యాప్‌లు, అనేక కనెక్టివిటీ పోర్ట్‌లకు సపోర్ట్ చేస్తాయి.

భారతదేశంలో థామ్సన్ QLED టీవీ ధర

భారత్ లో థామ్సన్ QLED టీవీ ధర రూ. 6,799 నుంచి ప్రారంభమవుతుంది.

టీవీ మోడళ్ల ధరలు

24-అంగుళాలు – రూ. 6,799
32-అంగుళాలు- రూ. 8,999
40-అంగుళాలు – రూ. 12,999

థామ్సన్ QLED టీవీ స్పెసిఫికేషన్లు

థామ్సన్ కొత్త QLED టీవీ శ్రేణి 24-, 32-, 40-అంగుళాల స్క్రీన్ సైజులలో అందుబాటులో ఉంటుంది. ఇవి VA ప్యానెల్‌లతో వస్తాయి. 1.1 బిలియన్ కలర్స్ కు సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలు Linux Coolita 3.0 OS పై పనిచేస్తాయి. ముందే ఇన్‌స్టాల్ చేయబడిన గేమ్‌లతో వస్తాయి. వీటిలో JioHotstar, YouTube, Prime Video, Sony Liv, Zee5 వంటి ప్రముఖ OTT యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది.

ఈ టీవీ లైవ్ ఛానెల్స్, నెట్‌వర్క్-ఫ్రీ స్క్రీన్ మిర్రరింగ్, వాయిస్ సెర్చ్ సపోర్ట్, మిరాకాస్ట్‌తో Wi-Fi తో వస్తుంది. 24-అంగుళాల మోడల్ 24W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉండగా, 32-అంగుళాల, 40-అంగుళాల మోడల్‌లు 36W అవుట్‌పుట్‌ను అందిస్తున్నాయి. ఇవి సరౌండ్ సౌండ్‌తో బాటమ్-ఫైరింగ్ స్పీకర్‌లను కలిగి ఉంటాయి. పోర్టులలో కోక్సియల్, HDMI, USB పోర్ట్‌లు ఉన్నాయి. థామ్సన్ QLED టీవీలు A35*4 ప్రాసెసర్‌తో వస్తున్నాయి.

JioTele OS తో మొదటి స్మార్ట్ టీవీ

థామ్సన్ ఇటీవల భారత్ లో కొత్త 43-అంగుళాల QLED టీవీని విడుదల చేసింది. ఇందులో తాజా JioTele OS ఉంది. జియో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న తొలి స్మార్ట్ టీవీ ఇది. దీని ధరను రూ.20,000 కంటే తక్కువకే వచ్చేస్తోంది. QLED స్క్రీన్‌తో కూడిన ఈ టీవీ బోలెడు ఫీచర్లు, పాపులర్ OTT యాప్‌లను కూడా కలిగి ఉంది.