- HMD రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లు విడుదల
- HMD 130 మ్యూజిక్, HMD 150 మ్యూజిక్
- యూపీఐ పేమెట్ ఫీచర్లతో వస్తున్నాయి

స్మార్ట్ ఫోన్లతో విసుగెత్తిపోయిన వారు ఫీచర్ ఫోన్లను యూజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫీచర్ ఫోన్లు కూడా యూపీఐ పేమెట్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. తాజాగా హ్యూమన్ మొబైల్ డివైసెస్ (HMD) రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. అవి HMD 130 మ్యూజిక్, HMD 150 మ్యూజిక్. వీటిని ప్రత్యేకంగా మ్యూజిక్ లవర్స్ కోసం రూపొందించారు. డెడికేటెడ్ మ్యూజిక్ కంట్రోల్ బటన్స్, శక్తివంతమైన స్పీకర్లు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తు్న్నాయి. ఈ ఫోన్‌లు సరసమైన ధరకు అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి.
రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర, HMD VP, CEO – ఇండియా & APAC, రవి కున్వర్ ఈ ఫోన్లను ఆవిష్కరించారు. HMD 130 మ్యూజిక్ ధర రూ. 1,899గా, HMD 150 మ్యూజిక్ ధర రూ. 2,399గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌లు ప్రముఖ రిటైల్ షాప్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, HMD.com లలో అందుబాటులో ఉంటాయి. రెండు ఫోన్‌లు వెనుక వైపు పెద్ద స్పీకర్‌లను కలిగి ఉన్నాయి, కంపెనీ బాక్స్‌లో 3.5mm జాక్‌తో కూడిన కాంప్లిమెంటరీ వైర్డు ఇయర్‌ఫోన్‌లను కూడా కలిగి ఉంది.
2500mAh రిమూవబుల్ బ్యాటరీ టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కస్టమర్లు 50 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 36 రోజుల స్టాండ్‌బై సమయాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఫోన్‌లలో వైర్‌లెస్, వైర్డు FM రేడియో, FM రికార్డింగ్, బ్లూటూత్ 5.0, 32GB వరకు SD కార్డ్ విస్తరణ కూడా ఉన్నాయి. ఈ ఫోన్లు స్టైలిష్, క్వాలిటీ డిజైన్‌తో వస్తున్నాయి. HMD 130 మ్యూజిక్ బ్లూ, డార్క్ గ్రే, రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
HMD 150 మ్యూజిక్ లైట్ బ్లూ, పర్పుల్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. HMD 130 మ్యూజిక్ లో ఇన్ బిల్ట్ UPI పేమెంట్ ఫీచర్ ఉంది. HMD 150 మ్యూజిక్ లో డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసే స్కాన్-అండ్-పే ఫీచర్ ఉంది. అదనంగా, ‘ఫోన్ టాకర్’ టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ హిందీ, ఇంగ్లీషులో యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తుంది. రెండు ఫోన్లు 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లేను ను కలిగి ఉన్నాయి. S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి.