Leading News Portal in Telugu

Samsung Galaxy Tab S10 FE and S10 FE+ Launched in India Pre-Orders Open with Exciting Discounts


  • శాంసంగ్ గెలాక్సీ S10 FE, S10 FE+ ట్యాబ్ లను భారత్ లో లాంచ్.
  • ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో
  • ప్రత్యేక డిస్కౌంట్స్ కూడా..
Samsung Galaxy Tab: గెలాక్సీ S10 FE, S10 FE+ ట్యాబ్ లను భారత్ లో లాంచ్ చేసిన శాంసంగ్

శాంసంగ్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ S10 FE, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ లను అధికారికంగా విడుదల చేసింది. దీనితో ఈ టాబ్లెట్‌లు భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన ఈ గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్ టాబ్లెట్‌లు మంచి స్పెసిఫికేషన్‌లతో వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీ-ఆర్డర్ ఆఫర్లను ఉపయోగించుకొని వీటిని మంచి తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ ట్యాబ్ ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. డిస్‌ప్లే పరంగా, గెలాక్సీ ట్యాబ్ S10 FE 10.9 అంగుళాల స్క్రీన్, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ 13.1 అంగుళాల స్క్రీన్ అందిస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ అందించారు. Exynos 1580 ప్రాసెసర్ ఇందులో పొందుపరిచారు. ఇక కెమెరా విషయానికి వస్తే.. రియర్ కెమెరాగా 13MP, ఫ్రంట్ కెమెరాగా 12MP అల్ట్రా-వైడ్ లు ఉన్నాయి. ఇవి వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ IP68 సర్టిఫైడ్ కలిగి ఉన్నాయి.

ఇక బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా.. గెలాక్సీ ట్యాబ్ S10 FE 8,000mAh, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ 10,090mAh బ్యాటరీలు కలిగి ఉండి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

గెలాక్సీ ట్యాబ్ S10 FE ధరలు:
8GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi) – రూ.42,999

12GB RAM + 256GB స్టోరేజ్ (Wi-Fi) – రూ.53,999

8GB RAM + 128GB స్టోరేజ్ (5G) – రూ.50,999

12GB RAM + 256GB స్టోరేజ్ (5G) – రూ.61,999

గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ధరలు:
8GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi) – రూ.55,999

12GB RAM + 256GB స్టోరేజ్ (Wi-Fi) – రూ.65,999

8GB RAM + 128GB స్టోరేజ్ (5G) – రూ.63,999

12GB RAM + 256GB స్టోరేజ్ (5G) – రూ.73,999

ఈ టాబ్లెట్‌లు శాంసంగ్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఆఫ్లైన్ రిటైల్ స్టోర్‌లలో కూడా ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ టాబ్లెట్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇక వీటికి ప్రీ-బుకింగ్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుపై (ఫుల్ పేమెంట్, EMI) తక్షణ డిస్కౌంట్ కింద గెలాక్సీ ట్యాబ్ S10 FE కు రూ.4,000, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ కు రూ.5,000 లభిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ S10 FE లేదా S10 FE+ కొనుగోలుపై రూ.3,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్ ఉంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 6 వరకు మాత్రమే ఉంటుంది.