Leading News Portal in Telugu

Motorola Edge 60 Fusion Launched in India with 120Hz pOLED Display, Dimensity 7400 SoC, and 50MP Camera


  • మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల
  • 6.7 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌
  • Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది.
Motorola edge 60 Fusion: 6.7 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌లతో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్

Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAM‌ను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి పనితీరు అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా (Sony LYT-700C సెన్సార్, OIS) కలిగి ఉంది. అలాగే 13MP అల్ట్రా-వైడ్ కెమెరా మాక్రో ఆప్షన్‌తో అందించబడింది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. మోటరోలా మూడు మెజర్ OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల భద్రతా నవీకరణలు అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఇది దీర్ఘకాలిక వినియోగదారుల కోసం మంచి అవకాశం. ఈ ఫోన్ MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను పొందింది. 16 రకాల మిలిటరీ టెస్టులను ఈ డివైస్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇది -20°C నుండి 60°C వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా దీని పనితీరు స్థిరంగా ఉంటుంది.

ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌లు కలిగి ఉంది. 1.5 మీటర్ల లోతులో 30 నిమిషాల పాటు ఉన్న కూడా రక్షణ కల్పిస్తుంది. అలాగే ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఇది స్క్రాచ్, గ్లాస్ బ్రేక్ నుండి రక్షణ ఇస్తుంది. ఇకపోతే, మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దినితో కేవలం కొద్ది నిమిషాల్లోనే వేగంగా ఛార్జ్ అవుతుంది. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ధర వివరాలు చూస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 22,999, 12GB RAM + 256GB మోడల్ రూ. 24,999 కి అందుబాటులో ఉంది.