Leading News Portal in Telugu

POCO C71 Launched in India with 6.88-inch 120Hz Display, Unisoc T7250, 5200mAh Battery at Rs. 6499


  • కేవలం రూ.6,499కే POCO C71 కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
  • 6.88 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ
  • 32MP రియర్ కెమెరా, సెకండరీ కెమెరా, LED ఫ్లాష్, 8MP సెల్ఫీ కెమెరా
  • 4GB + 64GB వేరియంట్ ధర రూ. 6,499
  • 6GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499.
POCO C71: కేవలం రూ.6,499కే 6.88 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ మొబైల్ ను తీసుకొచ్చిన పోకో

POCO C71: POCO సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71 ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్‌ప్లేతో వస్తుంది. TUV Rheinland సర్టిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు, లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కేడియన్ సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వెట్ టచ్ డిస్‌ప్లే సదుపాయం కూడా ఇందులో ఉంది. దీని వల్ల తడిగా ఉన్న చేతులతో కూడా ఫోన్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఫోన్ Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 6GB వరకు ర్యామ్‌తో పాటు 6GB వరకు వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంది.

ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే.. 32MP రియర్ కెమెరా (f/1.75 అపర్చర్), సెకండరీ కెమెరా, LED ఫ్లాష్, అలాగే 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ మొబైల్ 1.8 GHz Octa-Core Unisoc T7250 12nm ప్రాసెసర్, Mali-G57 MP1 GPUను కలిగి ఉంది. ఈ ఫోన్ Android 15 తో విడుదలైంది. POCO కంపెనీ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇచ్చింది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇందులో 5200mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ లో USB Type-C పోర్ట్, IP52 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, 3.5mm ఆడియో జాక్ కలిగి ఉన్నాయి. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 6,499 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499గా కంపెనీ నిర్ణయించింది కంపెనీ. ఈ ఫోన్ ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అందుబాటులో ఉంటుంది. ఇకపోతే, ఎయిర్టెల్ వినియోగదారుల కోసం POCO C71 కేవలం రూ. 5,999కి ప్రత్యేక ఆఫర్ కింద పొందవచ్చు. ఈ ధరలో ఇలాంటి అద్భుత ఫీచర్లు అందించడం POCO స్మార్ట్‌ఫోన్‌కు బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి పోటీని తెచ్చిపెట్టనుంది.