Leading News Portal in Telugu

Jio prepaid plans with free Netflix Jiohotstar subscription


  • యూజర్లకు రిలయన్స్ జియో క్రేజీ రీఛార్జ్ ప్లాన్స్
  • ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
  • మొదటి ప్లాన్ ధర రూ. 1799 కాగా, రెండవ ప్లాన్ ధర రూ. 1299
Jio: క్రేజీ రీఛార్జ్ ప్లాన్స్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్..

యూజర్లకు రిలయన్స్ జియో క్రేజీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఓటీటీ లవర్స్, క్రికెట్ ప్రియులకు మరింత కిక్కిచ్చేలా రెండ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఆ రెండు ప్లాన్లలో మొదటి ప్లాన్ ధర రూ. 1799 కాగా, రెండవ ప్లాన్ ధర రూ. 1299. ఈ ప్లాన్ల వివరాలు మీకోసం..

జియో రూ.1799 ప్లాన్

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మొత్తం 252GB డేటా లభిస్తుంది. ఈ జియో ప్లాన్ అపరిమిత కాలింగ్‌, రోజుకు 100 SMSలు కూడా వస్తాయి. దీనితో పాటు ఈ ప్లాన్‌లో 90 రోజుల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ ప్లాన్‌లో 50GB JioAICloud స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాను కూడా పొందొచ్చు.

జియో రూ.1299 ప్లాన్

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మొత్తం 168GB డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, JioHotstar 90 రోజుల సబ్‌స్క్రిప్షన్ వంటి అన్ని ఇతర సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు, ఈ ప్లాన్ 50GB JioAI క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది. మొత్తంమీద రెండు ప్లాన్‌లు ఎక్కువ డేటాను అలాగే ఎంటర్ టైన్ మెంట్ కావాలనుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.