Leading News Portal in Telugu

Noise Launches Air Buds Pro 6 with 49dB ANC, LHDC Support and 43-Hour Battery Life


  • కొత్త Noise Air Buds Pro 6 విడుదల
  • 12.4mm టైటానియం డ్రైవర్స్, క్వాడ్ మైక్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ సాయంతో
  • 24-బిట్ హై-క్వాలిటీ ఆడియో దీని సొంతం.
Noise Air Buds Pro 6: 24-బిట్ హై-క్వాలిటీ ఆడియో ఫీచర్ తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 లాంచ్

Noise Air Buds Pro 6: ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ (Noise) తాజాగా తన Air Buds Seriesలో కొత్త Noise Air Buds Pro 6ను విడుదల చేసింది. ఇది జనవరి 2025లో విడుదలైన Noise Air Buds 6కి సక్సెసర్‌గా మార్కెట్‌లోకి తీసుకవచ్చింది. వీటిని ఇన్-ఇయర్ స్టైల్ లో రూపొందించారు. 12.4mm టైటానియం డ్రైవర్స్, క్వాడ్ మైక్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ సాయంతో ఉత్తమ కాల్ క్వాలిటీని ఇవి అందిస్తాయి. వీటిలో 49dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) వ్యవస్థ ఉండగా, మొత్తం 43 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని కలిగి ఉన్నాయి.

అలాగే, ఇవి LHDC కోడెక్ కు మద్దతునిస్తూ, 24-బిట్ హై-క్వాలిటీ ఆడియో అందిస్తాయి. ఇది సాధారణ SBC కోడెక్ కంటే 3 రెట్లు అధిక సమాచారం ప్రసారం చేయగలదు. స్పేషియల్ ఆడియో అనుభూతిని కూడా వినియోగదారులకు అందిస్తుంది. ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీ సాయంతో కేవలం 10 నిమిషాల చార్జింగ్‌లో 150 నిమిషాల ప్లేబ్యాక్ టైమ్ ను పొందవచ్చు. దీని 50 మిల్లీసెకన్ల తక్కువ లాటెన్సీ మోడ్, ఇన్-ఇయర్ డిటెక్షన్, హైపర్ సింక్ కనెక్షన్, IPX5 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తాయి.

Noise Air Buds Pro 6 స్పెసిఫికేషన్ల పరిశీలించినట్లయితే ఇందులో.. 12.4mm టైటానియం డ్రైవర్స్, కనెక్టివిటీ కోసం Bluetooth v5.3, 49dB హైబ్రిడ్ ANC, స్పేషియల్ ఆడియో సపోర్ట్, LHDC కోడెక్ సపోర్ట్, టచ్ కంట్రోల్స్, కాల్స్ కోసం క్వాడ్ మైక్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్, 43 గంటల ప్లేబ్యాక్ టైమ్, 50ms తక్కువ లాటెన్సీ, హైపర్ సింక్ టెక్నాలజీ, Google Fast Pair, ఇన్-ఇయర్ డిటెక్షన్, IPX5 వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ ఉంటూ 1 సంవత్సరం వారంటీ అందించనున్నారు.

Noise Air Buds Pro 6 స్లేట్ బ్లాక్, నింబస్ గ్రే, మరియు పెటల్ పింక్ వంటి 3 రంగుల్లో లభించనున్నాయి. ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 3499గా నిర్ణయించబడింది. ఏప్రిల్ 9వ తేదీ నుండి Noise అధికార వెబ్‌సైట్, అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్ Noise వెబ్‌సైట్‌లో రూ. 499తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులు రూ. 999 విలువైన కూపన్ కోడ్ పొందతారు. దీనితో వారు సేల్ రోజు ఈ బడ్స్‌ను కేవలం రూ. 2500కే కొనుగోలు చేయవచ్చు.