Leading News Portal in Telugu

Redmi Watch Move launching in India on April 21 with AMOLED display and special features


  • Redmi Watch Move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల చేయనున్న రెడ్‌మీ (Redmi).
  • AMOLED డిస్‌ప్లేతో పాటు అద్భుత ఫీచర్లతో రాబోతున్న Redmi Watch Move.
  • “Your Next Big Move” అనే ట్యాగ్‌లైన్‌తో రెడ్‌మీ స్మార్ట్‌వాచ్‌ ప్రొమోట్.
Redmi Watch Move: 2.07 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 24 రోజుల బ్యాటరీ లైఫ్తో రెడ్‌మీ నుంచి రాబోతున్న మరో స్మార్ట్‌వాచ్!

Redmi Watch Move: రెడ్‌మీ (Redmi) చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi)కి చెందిన సబ్-బ్రాండ్. ఈ కంపెనీ ముఖ్యంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరల వద్ద ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గాడ్జెట్ల మార్కెట్‌లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. ఇకపోతే 2023లో Redmi Watch 5 Active, Watch 5 Lite లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు కంపెనీ తదుపరి స్మార్ట్‌వాచ్ అయిన Redmi Watch Move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “Your Next Big Move” అనే ట్యాగ్‌లైన్‌తో రెడ్‌మీ ఈ స్మార్ట్‌వాచ్‌ను ప్రొమోట్ చేస్తోంది. ఇది మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని మెరుగుపరచడానికి, అలాగే లైఫ్‌స్టైల్స్‌కు అనుగుణంగా డిజైన్ చేసిన ఫీచర్ రిచ్ వాచ్‌గా ఉండబోతున్నట్లు కంపెనీ చెబుతోంది.

ఇందులో AMOLED డిస్‌ప్లే ఉండబోతుందన్న విషయం కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ వాచ్‌కు కర్వుడ్ స్క్రీన్, అలాగే కుడివైపులో సింగిల్ బటన్ ఉండేలా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక రాబోయే స్మార్ట్‌వాచ్ లోని ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 2.07 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉండనునన్నట్లు సమాచారం. ఇందులో 5-సిస్టమ్ GNSS ఇంటిగ్రేషన్, అల్యూమినియం అలాయ్ ప్రీమియం ఫ్రేమ్, బ్లూటూత్ ఫోన్ కాల్ సపోర్ట్, డ్యూయల్ మైక్ నాయిస్ రిడక్షన్, లినియర్ మోటార్, ఒకే చార్జ్‌తో 24 రోజుల బ్యాటరీ లైఫ్ ఉండనున్నట్లు సమాచారం.

ఇప్పటికే టీజర్ విడుదల కావడంతో ఈ వాచ్‌కు సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్లు, ధర, అదనపు ఫీచర్లు అతి త్వరలో తెలియనున్నాయి. ఏప్రిల్ 21న అధికారికంగా విడుదలయ్యే ఈ వాచ్‌ గురించి పూర్తి సమాచారం త్వరలో అందుబాటులోకి రానుంది. రాబోయే Redmi Watch Move డిజైన్, ఫీచర్లు, లైఫ్‌స్టైల్ ఫోకస్‌తో భారతీయ వినియోగదారులకు ఒక విలువైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది. మీరు ఫిట్‌నెస్ గాడ్జెట్లలో ఆసక్తి ఉన్నవారైతే, ఈ వాచ్ మీకు ఎంతగానో ఉపయోగపడనుంది.