- ఒప్పో K13 5G పేరుతో భారత మార్కెట్ లోకి రిలీజ్
- 7000 mAh బ్యాటరీ
- ప్రారంభ ధర రూ.17,999

ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ విడుదలైంది. ఒప్పో K13 5G పేరుతో భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17,999. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్, 7,000 బ్యాటరీతో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు అనేక AI ఫీచర్లు, ‘సూపర్ బ్రైట్’ డిస్ప్లేతో వస్తుంది. Oppo K13 5G 128GB, 256GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది. ఇవి 8GB RAM తో వస్తున్నాయి. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999, 8GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన రెండవ వేరియంట్ ధర రూ. 19,999.
ఈ తాజా ఫోన్‌పై లాంచ్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో మీరు రూ. 1,000 తగ్గింపుతో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 25, 2025న మధ్యాహ్నం 12 గంటలకు OPPO ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్ అనే రెండు కలర్స్ లో లభించనుంది.
Oppo K13 5G ఫీచర్లు:
ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లేను ‘సూపర్-స్మూత్, సూపర్ బ్రైట్’ గా కంపెనీ అభివర్ణించింది. ఫోన్ భద్రత కోసం ఫోన్‌లో అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. Oppo ఫోన్ Snapdragon 6 Gen 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ColorOS 15పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ కూడా ఉంది. ఇది 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 62 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ AI ఎరేజర్, AI రిఫ్లెక్షన్ రిమూవర్, AI బ్లర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.