
OPPO K12s: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ప్రముఖ బ్రాండ్ ఒప్పో తన కొత్త K సిరీస్ స్మార్ట్‌ఫోన్ OPPO K12s ను చైనాలో అధికారికంగా ప్రకటించింది. ఇదే ఫోన్ భారతదేశంలో OPPO K13 5Gగా విడుదలైంది. అయితే చైనాలో విడుదలైన K12s వెర్షన్‌లో స్టార్ వైట్ అదనపు రంగు ఎంపికతో పాటు, 12GB + 256GB, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్లు కూడా లభ్యమవుతాయి. ఇక ఈ మొబైల్ సంబంధిత వివరాలను ఒకసారి చూసేద్దాం.
OPPO K12s ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో కూడిన ఆక్టా – కోర్ ప్రాసెసర్ ఉపయోగించబడింది. అలాగే Adreno 810 GPU ఈ ఫోన్‌కు గ్రాఫిక్స్ పరంగా ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ఇక ర్యాం, స్టోరేజ్ పరంగా చూస్తే.. ఇందులో 8GB లేదా 12GB ర్యాంతో, 128GB / 256GB / 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్ తో ఉన్నాయి. ఇది 4K వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇస్తుంది. ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఫోన్ లోని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, USB టైపు-C ఆడియో, 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్ గురించి. ఈ డివైస్‌లో 7000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 80W సూపర్ VOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఇక ఈ ఒప్పో K12s రోజ్ పర్పుల్, ప్రిజం బ్లాక్, స్టార్ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. చైనాలో ఏప్రిల్ 25 నుంచి ఫోన్ విక్రయానికి లభ్యం కానుంది. ఇక ధరల విషయానికి వస్తే.. 8GB + 128GB – 1199 యెన్స్ (సుమారు రూ.13,990), 8GB + 256GB – 1399 యెన్స్ (సుమారు రూ.16,320), 12GB + 256GB – 1599 యెన్స్ (సుమారు రూ.18,650), 12GB + 512GB – 1799 యెన్స్ (సుమారు రూ.20,990)లుగా నిర్ణయించారు. మంచి స్పెసిఫికేషన్లతో వచ్చిన ఫోన్ కావడం వల్ల మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఇది మంచి పోటీని ఇవ్వనుంది.