Leading News Portal in Telugu

Instagram Launches ‘Edits’ App to Simplify Short-Form Video Creation with Powerful Features


Edits App: అబ్బురపరిచే ఫీచర్లతో “ఎడిట్స్” యాప్ లాంచ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్

Edits App: మెటా కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త యాప్ ను లాంచ్ చేసింది. నేడు (ఏప్రిల్ 23) “ఎడిట్స్ (Edits)” అనే కొత్త స్టాండ్‌ అలోన్ యాప్‌ ను అధికారికంగా విడుదల చేసింది. వీడియోల క్రియేషన్ సులభతరం చేయడమే ఈ యాప్ ఉద్దేశం. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ఈ యాప్‌ను ప్రివ్యూ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, వీడియోలు తయారు చేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. అనేక యాప్‌లు, క్లిష్టమైన వర్క్‌ఫ్లోలు ఉండటం వల్ల క్రియేటర్లకు ఇది తలనొప్పిగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, క్రియేటర్లకు ప్రత్యేకంగా “ఎడిట్స్” యాప్‌ను రూపొందించారు. ఇందులో ఉన్న అనేక ఉపయోగకరమైన టూల్స్ సహాయంతో, వీడియో సృష్టి మరింత సులభంగా మారుతుంది.

ఇక ఈ యాప్ లో ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. వీడియో రికార్డింగ్, డైరెక్ట్ షేరింగ్/ఎక్స్‌పోర్ట్, 4K ఎక్స్‌పోర్ట్ సపోర్ట్, డ్రాఫ్ట్ మేనేజ్మెంట్, ఫ్రేమ్ లెవల్ ఎడిటింగ్, ఫ్రేమ్ లెవల్ ఎడిటింగ్, అడ్వాన్స్ కెమెరా కంట్రోల్స్, AI ఆధారిత ఫీచర్లు, క్రియేటివ్ అసెట్స్, ఆడియో ఎన్‌హాన్స్‌మెంట్స్, ఆటో క్యాప్షన్స్, రియల్‌టైమ్ ఇన్‌సైట్స్, ఆటో క్యాప్షన్స్, రియల్‌టైమ్ ఇన్‌సైట్స్, కంటెంట్ ట్రాకింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లను అందించనున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, యూజర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ యాప్ నిరంతరం అప్డేట్ అవుతుందని, రాబోయే రోజుల్లో కొన్ని ప్రధాన ఫీచర్లు చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కీఫ్రేమ్స్, AI స్టైల్ మాడిఫికేషన్, కో-క్రియేషన్, క్రియేటివ్ టూల్స్ వాటిని అందించనున్నారు. ఎడిట్స్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో డౌన్‌లోడ్‌కు సిద్ధంగా ఉంది. యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో లాగిన్ అయ్యి యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం కొత్త “ఎడిట్స్” యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీ క్రియేటివిటీని మరింత అందంగా మార్చండి.