Leading News Portal in Telugu

HONOR GT Pro Launched in China with Snapdragon 8 Elite, 200MP Camera, and 7200mAh Battery


  • 6.78 అంగుళాల డిస్‌ప్లే,
  • IP68, IP69 రేటింగ్‌
  • 7200mAh బ్యాటరీ, 90W వైర్డ్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్.
HONOR GT Pro: 6.78 అంగుళాల డిస్‌ప్లే, గేమింగ్ ప్రియులకు అత్యాధునిక ఫీచర్లతో ప్రత్యేకంగా వచ్చేసిన హానర్  GT ప్రో!

HONOR GT Pro: హానర్ సంస్థ తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన హానర్ GT ప్రోను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో గేమింగ్ ప్రియులకు ప్రత్యేకంగా రూపొందించబడింది.​ ఈ హానర్ GT ప్రో 6.78 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4320 Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే జర్మన్ రైన్ TUV గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 4.0 సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ లీడింగ్ ఎడిషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4.47GHz వరకు క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది 12GB లేదా 16GB LPDDR5X ర్యామ్, 256GB, 512GB లేదా 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.​

హానర్ GT ప్రోలో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్, 50x డిజిటల్ జూమ్) ఉన్నాయి. ఫ్రంట్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K 60fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 7200mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది 90W వైర్డ్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ​ఇక ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు DTS:X అల్ట్రా సౌండ్ ఎఫెక్ట్స్‌తో, 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, మరియు USB టైప్-C కనెక్టివిటీ​లు ఉన్నాయి.

హానర్ GT ప్రో చైనాలో ఐస్ క్రిస్టల్ వైట్, ఫాంటమ్ బ్లాక్, బర్నింగ్ స్పీడ్ గోల్డ్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధరల విషయానికి వస్తే ఇవి 12GB+256GB – 3699 యువాన్స్ (సుమారు రూ. 43,250), 12GB+512GB – 3999 యువాన్స్ (సుమారు రూ.46,755), 16GB+512GB – 4299 యువాన్స్ (సుమారు రూ.50,265), 16GB+1TB – 4799 యువాన్స్ (సుమారు రూ.56,110)​గా నిర్ణయించారు.