
Realme 14T 5G: రియల్‌మీ తన తాజా స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5G ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ముఖ్యంగా అధునాతన డిస్‌ప్లే, బలమైన బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, సొగసైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్, 1500Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో వస్తోంది. ఈ మొబైల్ సిల్కెన్ గ్రీన్, వయొలెట్ గ్రేస్, శాటిన్ ఇన్క్ రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇక ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా కలిపి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా (Sony IMX480 సెన్సార్‌తో) ఉంచారు. ఈ ఫోన్‌లో మీడియా టెక్ Dimensity 6300 6nm ప్రాసెసర్, 8GB RAM, 128GB / 256GB స్టోరేజ్ (2TB వరకు పొడిగించేలా) ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌కి 6000mAh టైనాన్ బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టెరియో స్పీకర్లు మరియు 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇక మొబైల్ ధర, ఆఫర్లు వివరాలను చూస్తే.. 8GB + 128GB వేరియంట్ రూ. 17,999 కాగా, రూ. 1000 బ్యాంక్ ఆఫర్ తో రూ. 16,999లకు లభిస్తుంది. అలాగే 8GB + 256GB వేరియంట్ రూ.19,999 కాగా, రూ. 1000 బ్యాంక్ ఆఫర్ తో రూ. 18,999లకు లభిస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 25, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏప్రిల్ 30, రాత్రి 11:59 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రియల్‌మీ14T 5G ను రియల్‌మీ, ఫ్లిప్ కార్ట్, ఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వినియోగదారులకు అధునాతన ఫీచర్లను, శక్తివంతమైన పనితీరును మధ్యస్థ ధరలో అందించేందుకు రియల్‌మీ చేసిన మరో గొప్ప ప్రయత్నంగా చెప్పొచ్చు.