Leading News Portal in Telugu

These are top 3 branded smartphones under Rs 8,000


  • రూ. 8 వేల లోపు ధరతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు
  • Samsung, Motorola, Realme
Smart Phone :రూ. 8 వేల లోపు ధరలో బ్రాండెడ్ టాప్ 3 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ ధరలోనే మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లోనే ఫోన్లను అందిస్తున్నాయి. రూ. 8 వేల లోపు ధరతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. మీరు రూ. 8 వేల బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే బ్రాండెడ్ టాప్ 3 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Realme నుంచి వచ్చిన ఫోన్లు ఉన్నాయి. అద్భుతమైన డిస్ప్లే, అత్యుత్తమ ఇన్-క్లాస్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్స్ వరకు ప్రధాన కెమెరాను కలిగి ఉంటాయి. ఈ ఫోన్లు 5200mAh బ్యాటరీతో వస్తాయి.

రియల్‌మి నార్జో N61

4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర Amazon Indiaలో రూ.7,499. ఈ ఫోన్ 6GB వరకు RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో ప్రాసెసర్‌గా UNISOC T612 ను అందిస్తోంది. ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్ బ్యాటరీ 5000mAh, ఇది 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

మోటరోలా G05

4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7299. ఈ మోటరోలా ఫోన్‌లో, మీకు 6.67 అంగుళాల పంచ్-హోల్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ తో వస్తుంది. దీనిలో హీలియో G81 చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌గా అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అందించారు. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ మోటరోలా ఫోన్ బ్యాటరీ 5200mAh.

శామ్సంగ్ గెలాక్సీ M05

4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,980. శామ్సంగ్ నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. దీనిలో మీకు 6.7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది.