Leading News Portal in Telugu

Motorola Edge 60 Pro Launching in India on April 30, its official


Motorola Edge 60 Pro: ఇట్స్ అఫీషియల్.. భారత్‌లో విడుదల కానున్న మోటొరోలా ఎడ్జ్ 60 ప్రో

Motorola Edge 60 Pro: మోటొరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ప్రో ను భారత్‌లో ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల గ్లోబల్‌గా పరిచయం చేసిన ఈ ఫోన్‌ను విడుదల చేసే సమయంలోనే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి తెచ్చనున్నట్లు కంపెనీ తెలిపింది. గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే భారత్ లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు ఉండబోవు. మరి ఈ మోటొరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లను ఒకసారి చూద్దామా..

ఈ మొబైల్ పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ షాడో, పాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్ రంగులలో ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తోంది. స్క్రీన్ గారిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రముఖ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ 4nm ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC6 GPU అందుబాటులో ఉంది. ర్యామ్ పరంగా ఇది 8GB, 12GB వేరియంట్లలో వస్తుంది. స్టోరేజ్ 256GB UFS 4.0 ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ రన్ అవుతుంది. మోటొరోలా 3 OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను అందించనుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో.. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్‌ట్రా వైడ్ కెమెరా, 10MP 3x టెలిఫోటో కెమెరాతో పాటు 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఫోన్‌లో యూఎస్బీ టైప్-C ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్ ఉన్నాయి. IP68 + IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. 5G సపోర్ట్‌తో పాటు, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, జీపీఎస్, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా బ్యాటరీ విషయానికి వస్తే.. 6000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో మొబైల్ రానుంది. ఇది 90W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ రెండు వేరియంట్లలో లభించనుంది. ఇక ఫోన్ ధర వివరాలు ఏప్రిల్ 30న అధికారికంగా ప్రకటించనున్నారు. భారత్‌లో ఈ ఫోన్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి.