CMF Phone 2 Pro Launched in India with 6.77 inches AMOLED Display, Dimensity 7300 Pro SoC, Starting at Rs. 18999

CMF Phone 2 Pro: Nothing సబ్ బ్రాండ్ CMF నుండి రెండో ఫోన్ అయిన CMF Phone 2 Pro భారత మార్కెట్లో తాజాగా లాంచ్ అయింది. కంపెనీ హామీ ఇచ్చినట్టుగానే ఈ ఫోన్‌ను నేడు విడుదల చేసింది. మరి ఈ కొత్త మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. ఈ ఫోన్ 6.77 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED స్క్రీన్‌తో వస్తోంది. ఇది 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది గత మోడల్‌తో పోల్చితే కాస్త పెద్దదిగా ఉంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లే మరింత మన్నికగా ఉంటుంది. ఫోన్ 7.8 మిల్లీమీటర్ల మందంతో మరింత స్లిమ్‌గా రూపుదిద్దుకుంది. ఈ మొబైల్ బరువు 185 గ్రాములు మాత్రమే.
CMF Phone 2 Pro ఫోన్‌లో మీడియా టెక్ Dimensity 7300 ప్రో చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గత తరం 7300 చిప్‌తో పోల్చితే 10% వేగవంతమైన CPU, 5% వేగవంతమైన GPU పనితీరును అందించనుంది. 6వ తరం NPUతో, ఫోన్ 4.8 TOPS AI పనితీరును అందిస్తుంది. 8GB ర్యామ్ తో పాటు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పై పనిచేస్తుంది. కంపెనీ మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని హామీ ఇచ్చింది.
అంతేకాకుండా, Essential Space అనే కొత్త AI ఆధారిత ఫీచర్ అందించబడింది. ఇది నోట్‌లు, ఆలోచనలు, ఇన్స్పిరేషన్లను సురక్షితంగా భద్రపరచడానికి ఉపయోగపడుతుంది. Essential Key ద్వారా వేగంగా కంటెంట్‌ను క్యాప్చర్ చేసి Essential Spaceకి పంపవచ్చు. ఇక ఫోన్ కెమెరా విభాగంలో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP 2x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 20x డిజిటల్ జూమ్ మద్దతుతో 4K వీడియో రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఇందులో 5000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో వస్తుంది.
ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 ధూళి, నీటి నిరోధకత, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, బాటమ్ పోర్టెడ్ 150% అల్ట్రా వాల్యూమ్ స్పీకర్ లు ఇందులో ఉన్నాయి. ఇక ధర, లభ్యత విషయానికి వస్తే .. 8GB + 128GB వేరియంట్ రూ.18,999 కాగా, 8GB + 256GB వేరియంట్ రూ.20,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మే 5వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ప్లాట్‌ఫార్ములలో కొనుగోలు చేయొచ్చు. ఇక లాంచ్ ఆఫర్ల కింద HDFC, ICICI, SBI, Axis బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలుపై రూ.1000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనంగా రూ.1000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ వైట్, బ్లాక్, ఆరెంజ్, లైట్ గ్రీన్ నాలుగు రంగులలో లభ్యమవుతోంది. బ్లాక్, లైట్ గ్రీన్ గ్లాస్ లాంటి ఫినిష్‌తో వస్తే.. ఆరెంజ్ మెటాలిక్ షీన్ కలిగి ఉంటుంది.