Leading News Portal in Telugu

Lava Unveils D2M Feature Phones with Live TV Support, No Internet Connection Need


LAVA: గేమ్ ఛేంజర్.. ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ, ఎమర్జెన్సీ అలర్ట్స్..!

LAVA: ఫీచర్ ఫోన్ విభాగంలో గేమ్ ఛేంజర్ విధంగా, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తమ కొత్త డైరెక్ట్-టూ-మొబైల్ (D2M) ఫీచర్ ఫోన్లను ప్రకటించింది. టెజాస్, ఫ్రీ స్ట్రీమ్ టెక్నాలజీలతో కలిసి అభివృద్ధి చేసిన ఈ ఫోన్లు మొబైల్ మార్కెట్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. ఈ ఫోన్లలో ఉపయోగించిన D2M టెక్నాలజీని మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరుగబోయే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి.

ఈ ఫోన్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన “మేక్ ఇన్ ఇండియా” పథకానికి అనుగుణంగా తయారు చేయబడ్డాయి. ఈ డివైస్‌లు ఆధారిత ప్రసార టీవీ తరంగాలను ఉపయోగించి ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ, OTT వీడియోలు, ఆడియో, టెక్స్ట్ మెసేజెస్‌ను అందించగలవు. ప్రజా, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమాచారాన్ని సరఫరా చేయడం వీటి లక్ష్యం. ఇక ఈ లావా ఫోన్‌ లోని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ను చూసినట్లయితే.. ఇందులో 2.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, టీవీ ప్రసారాల స్వీకరణకు UHF యాంటెనా, వాయిస్ కాల్స్‌కి GSM సపోర్ట్, 2200mAh బ్యాటరీ, మీడియాటెక్ MT6261 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైన ఫోన్, సాంక్‌యా ల్యాబ్స్‌కు చెందిన SL3000 సాఫ్ట్‌వేర్ రిసీవర్ చిప్‌తో కూడిన ట్యూనింగ్, సాంక్‌యా ల్యాబ్స్ SDKతో కలసి పనిచేసే సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు అంతరాయంలేని అనుభవాన్ని అందిస్తుంది.

ఈ ఫోన్లు ముఖ్యంగా గ్రామీణ, తక్కువ ఆదాయ ప్రజలకు సమాచారంతో పాటు వినోదాన్ని కూడా అందించాలన్న ఉద్దేశంతో రూపొందించబడ్డాయి. ఎమర్జెన్సీ అలర్ట్స్, ప్రభుత్వ సమాచారం, పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్‌ను వేగంగా, విశ్వసనీయంగా అందించగలవు. అయితే ఇప్పటికే A1 జోష్ BOL, A5 2025 (UPI పేమెంట్స్‌తో), Action 4G (యూట్యూబ్ సపోర్ట్‌తో), A3 Torch వంటి లావా ఫీచర్ ఫోన్లు మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ ఫోన్లలో బోల్స్ (BOL), క్లౌడ్ సర్వీసులు, యూజర్ సహకార ఫీచర్లు లభిస్తున్నాయి. ఇవన్నీ “వికసిత్ భారత్”కు మద్దతుగా పనిచేస్తున్నాయని కంపెనీ పేర్కొంది.

D2M ఫీచర్ ఫోన్ల ధర, లభ్యతపై వివరాలు ఇంకా వెల్లడించలేదు. వాటిని WAVES 2025 కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కొత్త టెక్నాలజీతో ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో లావా పెద్ద మైలురాయిగా నిలుస్తోంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా డిజిటల్ కంటెంట్‌ను అందించగల ఫోన్‌లు గ్రామీణాభివృద్ధికి దోహదం చేయనున్నాయి.