Leading News Portal in Telugu

vivo Y19 5G Launched in India with 6.74 inches Display, 5500mAh Battery and Military-Grade Durability Starting at Rs. 10499 only


Vivo Y19 5G: రూ.10,499 లకే 6.74 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ ఉన్న వివో స్మార్ట్ ఫోన్

Vivo Y19 5G: వివో కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో Y19 5G ను భారత్‌లో విడుదల చేసింది. ఇది Y సిరీస్‌లోకి కొత్తగా వచ్చిన ఫోన్‌. ఇటీవల విడుదలైన Y39 5G అప్డేటెడ్ మోడల్. భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, 5G కనెక్టివిటీ వంటి లక్షణాలతో ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునే ఫోన్‌గా నిలుస్తోంది. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..

వివో Y19 5G మొబైల్ లో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే లభిస్తుది. దీనికి 90Hz రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డిమెంసిటీ 6300 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గేమింగ్ కోసం Mali-G57 MC2 GPU ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 4GB, 6GB ర్యాంలలో లభించనుండగా, అదనంగా 6GB వరకు వర్చువల్ ర్యాం సపోర్ట్ ఉంది. స్టోరేజ్ పరంగా 64GB, 128GB వేరియంట్లు అందుబాటులో ఉండగా.. వీటిని microSD ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. ఇక కెమెరా విభాగానికి వస్తే.. వివో Y19 5Gలో 13MP ప్రైమరీ కెమెరాతో పాటు 0.08MP పోర్ట్రెయిట్ కెమెరా ఉంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 పై పనిచేస్తూ, Funtouch OS 15 వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో AI Erase, AI Photo Enhance, AI Documents వంటి అత్యాధునిక AI ఫీచర్లు ఉన్నాయి.

అలాగే ఈ ఫోన్‌ 5,500mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి బ్లూవోల్ట్ టెక్నాలజీ మద్దతిస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాటరీకి 5 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ హెల్త్ గ్యారంటీ కూడా అందిస్తారు. వివో Y19 5G మిలిటరీ గ్రేడ్ మన్నికతో లభిస్తుంది. అలాగే IP64 రేటింగ్ ద్వారా దుమ్ము, నీటి నుండి రక్షణ ఉంటుంది. ఈ ఫోన్ USB టైప్-C పోర్ట్, 200% వాల్యూమ్ బూస్టర్ ఉన్న స్పీకర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లతో వస్తుంది.

వివో Y19 5G టిటానియం సిల్వర్, మజెస్టిక్ గ్రీన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక ధరలు, లభ్యత విషయానికి వస్తే.. 4GB + 64GB వేరియంట్ రూ. 10,499 కాగా, 4GB + 128GB వేరియంట్ రూ. 11,499, 6GB + 128GB వేరియంట్ రూ. 12,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్‌ ఆన్లైన్ లో ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా సైట్స్ లో, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇక ప్రారంభ ఆఫర్ కింద.. 6GB + 128GB వేరియంట్‌పై జీరో డౌన్‌పేమెంట్ తో పాటు 3 నెలల నో-కాస్ట్ EMI అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.