Leading News Portal in Telugu

Lava Yuva Star 2 Launched in India with 6.75 inches Display, 5000mAh Battery for Just Rs. 6499


Lava Yuva Star 2: ఇది కలనా.? నిజమా.? కేవలం రూ. 6,499కే 5000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే..!

Lava Yuva Star 2: దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) తాజాగా తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా Lava Yuva Star 2 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన యువా స్టార్‌కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో, అత్యంత సమర్థవంతమైన ధరలో అందుబాటులోకి వచ్చింది. మరి ఇంత తక్కువ ధరలో యిలాంటి ఫీచర్లను అందిస్తుందో ఒకసారి చూద్దామా..

Lava Yuva Star 2 స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. 2.5D గ్లాస్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను ఆక్టా-కోర్ UNISOC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇందులో 4GB RAM, అదనంగా 4GB వర్చువల్ RAM కూడా ఉంది. ఫోన్‌లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇది 512GB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. లావా ఈ ఫోన్‌ను ఆండ్రాయిడ్ 14 Go ఎడిషన్ మీద నడుపుతోంది. ఈ ఫోన్‌లో 13MP మెయిన్ కెమెరా, AI కెమెరా, LED ఫ్లాష్ తో కలిపి ఉంటుంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Lava Yuva Star 2 ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 10W USB టైపు-C ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. గ్లాసి బ్యాక్ డిజైన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, బాటమ్ పోర్టెడ్ స్పీకర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గల ఫోన్. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 4.2, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్లను సపోర్ట్ చేస్తుంది.

ఇక ఈ Lava Yuva Star 2 ఫోన్ రేడియంట్ బ్లాక్, స్పార్క్ లింగ్ ఐవరీ వంటి రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. దీని ధర రూ. 6,499 (ఎక్స్‌ షోరూమ్) మాత్రమే. ఫోన్‌పై 1 సంవత్సరం వారంటీ, అలాగే ఉచిత హోమ్ సర్వీస్ కూడా లభిస్తుంది. ఇది ఇప్పటికే భారతదేశంలోని అన్ని రిటైల్ దుకాణాల్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంత ధరలో ఈ స్థాయి ఫీచర్లు తీసుకురావడంతో Lava Yuva Star 2 బడ్జెట్ వినియోగదారులకు ఓ మంచి ఎంపికగా నిలవనుంది.