
Motorola Razr 60 Ultra: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల మోటొరోలా విడుదల చేసిన కొత్త ఫ్లిప్ ఫోన్ Motorola Razr 60 Ultra త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్ గా అభివర్ణించింది. ఇందులో అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఈ ఫోన్‌లో మోటో AI ఫీచర్లను కూడా టీజర్‌లో హైలైట్ చేశారు. ఈ ఫోన్‌ను రియో రెడ్, మౌంటెన్ ట్రయిల్ అనే రెండు ఆకర్షణీయ రంగుల్లో విడుదల చేయనున్నారు. ఇది అమెజాన్, మోటొరోలా వెబ్ సైట్స్ లో ఆన్లైన్ లో, అలాగే కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులోకి తీసుకరానుంది. అయితే ఈ మొబైల్ విడుదల తేదీని మాత్రం తెలపలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
మోటొరోలా రేజర్ 60 అల్ట్రా ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ లోపల 7 అంగుళాల ఫ్లెక్స్ వ్యూ 1.5K pOLED LTPO డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1-165Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తూ డాల్బీ విజన్ సపోర్ట్‌తో 4,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. ఇక బయట మాత్రం 4 అంగుళాల క్విక్ వ్యూ pOLED LTPO డిస్‌ప్లేతో వస్తోంది. దీనికి గోరిల్లా గ్లాస్ సిరామిక్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. అలాగే ఇందులో 3,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ మొబైల్ ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. అలాగే Adreno 830 GPU తో మరింత శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. ఇందులో 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఆపరేటింగ్ సిస్టంగా తాజా ఆండ్రాయిడ్ 15 వర్షన్‌ను ఉపయోగిస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే., ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రాథమిక కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరాలతో వస్తోంది. ముందు భాగంలో కూడా 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఆడియో పరంగా USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇక బ్యాటరీ సామర్థ్యం చూస్తే.. ఇందులో 4700mAh కాగా, ఇది 68W టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది IP48 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రీమియం స్పెసిఫికేషన్లు, AI ఆధారిత ఫీచర్లు, డ్యూయల్ డిస్‌ప్లే అనుభవం కలిగి ఉండటం వల్ల భారత వినియోగదారులకు ఇది ఒక ప్రత్యేకమైన ఫ్లిప్ ఫోన్ అనుభూతిని ఇవ్వనుంది.