Leading News Portal in Telugu

Moto G56 5G with 6.72 inches Display, IP69 Rating and 5200mAh Battery Leaked Ahead of Launch


Moto g56 5G: 6.72 అంగుళాల డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ, IP69 సర్టిఫికేషన్లతో రాబోతున్న మోటో g56..!

Moto g56 5G: మోటరోలా త్వరలో విడుదల చేయబోయే మోటో g56 5G ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫోటోలు లీకయ్యాయి. లీకుల ద్వారా అందిన వివరాల ప్రకారం, మోటో g55 5Gకు అప్డేట్ గా ఈ మోడల్ రాబోతోందని తెలుస్తోంది. ఇక లీకైన సమాచారం మేరకు మోటో g56 5G మొబైల్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్‌ తో మంచి విజువల్ అనుభవాన్ని అందించనుంది. గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌కు ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ IP68, IP69 సర్టిఫికేషన్లతో వస్తోంది. అంటే ఇది ధూళి, నీటి నిరోధకత పరంగా మరింత పటిష్టంగా ఉండనుంది.

ఈ ఫోన్‌లో మీడియాటెక్ Dimensity 7060 6nm చిప్‌సెట్ ఉంది. ఇది ఇదివరకు వాడిన Dimensity 7025 కంటే క్లాక్ స్పీడ్ పరంగా మెరుగ్గా ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం IMG BXM-8-256 GPU ఉంటుంది. ఈ మొబైల్ 4GB, 8GB ర్యామ్, 128GB, 256GB స్టోరేజ్ తో వస్తోంది. అలాగే 2TB వరకు మెమరీ కార్డు ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇక ఫోటోగ్రఫీ పరంగా చూస్తే.. మోటో g56 5G వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందుభాగంలో 32MP కెమెరా కలదు. ఇక ఇందులో సైడ్ ఫింగర్‌ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయంలో కూడా 2 నుంచి 4 సంవత్సరాల వరకు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. మోటో g56 5Gలో 5200mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో ఇతర ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే.. USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఈ ఫోన్ నాలుగు బ్లాక్ వోయిస్టర్, గ్రే మిస్ట్, డేజ్లింగ్ బ్లూ, దిల్ పాంటోనే కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే యూరోప్ లో ఈ ఫోన్‌ ధర 250 యూరోలు (దాదాపు 23,880) ఉండే అవకాశముంది. అయితే దీనిని భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తారో అన్న విషయం తెలియాల్సి ఉంది.